Health: మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..? ఈ రంగులో కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..

ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. అందుకే.. ఆరోగ్యాన్ని జాగ్ర్తగా చూసుకోవాలి.. సరైన జీవనశైలి.. మంచి ఆహారం తీసుకోవాలి.. అయితే.. అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలామందిలో కనిపిస్తోంది.. ఇది మన ఆరోగ్యానికి శత్రువు అని మనందరికీ తెలుసు.. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది.

Health: మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..? ఈ రంగులో కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..
Cholesterol
Follow us

|

Updated on: Jun 30, 2024 | 11:46 AM

ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వ్యాధులు వెంటాడుతున్నాయి. అందుకే.. ఆరోగ్యాన్ని జాగ్ర్తగా చూసుకోవాలి.. సరైన జీవనశైలి.. మంచి ఆహారం తీసుకోవాలి.. అయితే.. అధిక కొలెస్ట్రాల్ సమస్య చాలామందిలో కనిపిస్తోంది.. ఇది మన ఆరోగ్యానికి శత్రువు అని మనందరికీ తెలుసు.. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే ఎల్‌డిఎల్‌ను తగ్గించాలని వైద్యులు ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తారు. కొలెస్ట్రాల్ ను రెండు రకాలుగా విభజిస్తారు.. . అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL)అంటే మంచి కొలెస్ట్రాల్ గా.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) ను చెడు కొలెస్ట్రాల్ గా చెబుతారు. కొలెస్ట్రాల్ పెరుగుదలను లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.. అంతేకాకుండా.. శరీరంలో కనిపించే కొన్ని సంకేతాల ద్వారా దానిని ముందే తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

వాస్తవానికి కొలెస్ట్రాల్ సమస్య చాలా అవయవాలను ప్రభావితం చేస్తుంది.. అయితే.. గోర్లలో మార్పులను చూడటం ద్వారా అధిక కొలెస్ట్రాల్ గురించి మీరు అప్రమత్తం కావొచ్చు.. గోర్లపై ఇలాంటి కొన్ని లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకోండి..

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి..

  1. పసుపు గోర్లు: గోర్లు పసుపు రంగులోకి మారడం అనేది అధిక కొలెస్ట్రాల్‌తో సంబంధం కలిగి ఉండే ఒక సాధారణ లక్షణం. కొలెస్ట్రాల్ చేరడం వల్ల, రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది.. దీని కారణంగా గోర్లు రంగు మారవచ్చు.
  2. గోర్లు గట్టిపడటం: గోర్లు గట్టిపడటం కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంబంధించినది. LDL స్థాయిలు గోళ్ల నిర్మాణంలో మార్పులకు కారణమవుతాయి. దీని వలన అవి మందంగా, గట్టిగా మారతాయి.
  3. గోళ్లపై తెల్లటి మచ్చలు: గోళ్ళపై చిన్న తెల్లని మచ్చలు కనిపిస్తే, ఇది కూడా కొలెస్ట్రాల్ పెరిగిన సంకేతం కావచ్చు. ఈ మచ్చలు రక్తంలో లిపిడ్లు అధికంగా చేరడాన్ని సూచిస్తాయి.. ఇది అధిక కొలెస్ట్రాల్ లక్షణం కావచ్చు.
  4. గోర్లు నెమ్మదిగా పెరుగుదల: గోరు పెరుగుదల లేకపోవడం కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతం. రక్త ప్రసరణ లేకపోవడం వల్ల, గోరు పెరుగుదల మందగిస్తుంది.. దీంతో అవి బలహీనంగా మారవచ్చు.
  5. బలహీనమైన గోర్లు: అధిక కొలెస్ట్రాల్ గోర్లు బలహీనంగా, పెళుసుగా మారడానికి కారణమవుతుంది.. తద్వారా అవి సులభంగా విరిగిపోతాయి. ఇది కూడా మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిందనడానికి సంకేతం కావచ్చు.

గోర్ల సంరక్షణ – కొలెస్ట్రాల్ నియంత్రణ ఎలా..

ఆరోగ్యకరమైన ఆహారం: మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ ఆధారిత ఆహార పదార్థాలను చేర్చండి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

వ్యాయామం: వ్యాయామం కోసం ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

సిగరెట్లు – మద్యం మానుకోండి: ధూమపానం, అధిక మద్యపానం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీన్ని వదిలేయడం కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

గోర్ల సంరక్షణ: గోర్లను క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలి.. జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పటికప్పుడు గోళ్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా కొలెస్ట్రాల్ లక్షణాలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది.

సాధారణ పరీక్ష: మీ కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
వండర్స్‌ క్రియేట్ చేయడంలో జక్కన్న అప్‌డేట్ అవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌.. కేబినెట్‌లో వారికే ఛాన్స్‌?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?
గర్భిణీలు చిన్న విషయానికే ఎందుకు చిరాకు పడతారో తెలుసా?