సువాసనల రోజ్‌మేరీతో చేసిన హెర్బల్‌టీ ఎప్పుడైనా తాగారా?
01 July 2024
TV9 Telugu
TV9 Telugu
సన్నటి ఈనెల్లాంటి ఆకులతో... గాఢమైన పరిమళాన్ని పంచే రోజ్‌మేరీ మొక్క.. పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద ఇది. దీన్ని ఎక్కువగా విదేశీ వంటల్లో కొత్తిమీరకు బదులుగా వాడతారు
TV9 Telugu
ప్రధానంగా మాంసాహార వంటల్లో, బ్రెడ్-సూప్స్ తయారీలో, సలాడ్లలోనూ దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. దీంతో హెర్బల్ టీ కూడా తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో రోజ్‌మేరీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
TV9 Telugu
బూడిద రంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదుల్లాంటి సన్నని ఆకులతో, సువాసన గల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుందీ మొక్క. దాదాపు మూడు అడుగుల ఎత్తు వరకు పెరిగే చిన్నపొద ఇది
TV9 Telugu
నీరు నిలవని ఇసుక నేలల్లో, చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఈ మొక్క కొమ్మలకు ఆరోగ్య ప్రయోజనాలెక్కువట. అందుకే వీటితో చేసే హెర్బల్‌టీ తాగమంటున్నారు పోషకాహార నిపుణులు
TV9 Telugu
తాజా రోజ్‌మేరీ ఆకులతో పాటు ఎండిన వాటితో టీ తయారు చేసుకుని తాగొచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీఫెనాల్స్ జీర్ణశక్తికి తోడ్పడి ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి
TV9 Telugu
అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ వంటివి అదుపు చేస్తాయి. జీవక్రియల్ని వేగాన్ని పెంచుతాయి. అంతేకాదు, అతిగా తినే అలవాటుతో పాటు బరువుని తగ్గించే గుణాలూ దీనికి ఉన్నాయి
TV9 Telugu
రోజ్‌మేరీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లోని రోస్మరినిక్ యాసిడ్, కార్నోసిక్ యాసిడ్ చాలా శక్తిమంతమైనవి. ఇవి శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి
TV9 Telugu
దాంతో వ్యాధుల ముప్పూ తగ్గుతుంది. ఈ మూలికా మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. ఒంట్లోని వాపుల్నీ, కీళ్లూ, కండరాల నొప్పుల్ని తగ్గించే సుగుణాలు ఇందులో ఉన్నాయి. నొప్పుల్నీ నియంత్రిస్తాయి. దీని టీ తాగితే హాయిగా నిద్రా పడుతుంది