మసాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ముఖ్యంగా లవంగాలు, ఇలాచీ, పసుపు, మెంతుల వంటి మసాలాలు చెడు శ్వాసకు కారణమవుతుంది.
వెల్లుల్లి, ఉల్లి నాలుకకు, దవడలకు అతుక్కుపోవటం వల్ల నోటి నుంచి వాసన వస్తుంది. వీటివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ కారణంగా చెమట ఎక్కువై శరీరం నుంచి వాసన వస్తుంది.
మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి నుంచే కాకుండా శరీరం నుంచి కూడా వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
క్యాబేజీ, గోబీ ఎక్కువగా తీసుకున్నా ఆ సమస్య వస్తుంది. ఇందులోని సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఇది చెమట, శ్వాస ద్వారా బయటకు వచ్చేప్పుడు వాసన వస్తుంది.
ఈ సమస్య నుంచి బయట పడాలంటే స్నానం చేసే ముందు టమాట రసాన్ని స్నానం చేసే నీటిలో వసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసనని కలిగించే బ్యాక్టీరియా తగ్గుతుంది.
వంటసోడా కూడా చెమట వాసనని దూరం చేస్తుంది. ఇందుకోసం ఓ కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. దీనిని అండర్ ఆర్మ్స్ ప్రాంతంలో స్ప్రే చేస్తే ఫలితం ఉంటుంది.
విపరీతమైన చమట సమస్యతో బాధపడుతుంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగడపడుతుంది. ఒక కాటన్‌లో ముంచి శరీరానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం