01 July 2024
పుల్లగా ఉంటుంది..
కానీ తింటే మాత్రం
Narender.Vaitla
చింతపండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెరుగైన జీర్ణ వ్యవస్థకు చింతపండు ఉపయోగపడుతుంది.
అల్సర్ వంటి సమస్యలను చెక్ పెట్టడంలో కూడా చింతపండు ఉపయోగపడుతుంది. ఇందులోని పాలీఫెనోలిక్ సమ్మేళనాలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో చింతపండు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక పెరుగుతుంది.
ఇక చింత పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
కంటి ఆరోగ్యం మెరుగుపడడంలో కూడా చింతపండు ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ ఎతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చింతపండు ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కూడా కాపాడుతుంది.
చింతపండుతో లాభాలు ఉన్నట్లే.. నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చింతపండును ఎక్కువగా తీసుకుంటే దంతాల ఆరోగ్యం దెబ్బ తింటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..