Health Tips: మధుమేహం ఉన్నవాళ్లు ఈ కూరగాయలను తినకపోవడం మంచిది.. ఎందుకంటే..!

Health Tips: కూరగాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో చాలా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. అదే విధంగా డయాబెటిక్ పేషెంట్లు కొన్ని..

Health Tips: మధుమేహం ఉన్నవాళ్లు ఈ కూరగాయలను తినకపోవడం మంచిది.. ఎందుకంటే..!
Health Care Tips

Updated on: Aug 07, 2022 | 7:12 AM

Health Tips: కూరగాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో చాలా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. అదే విధంగా డయాబెటిక్ పేషెంట్లు కొన్ని కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ఏ కూరగాయలను చేర్చుకోకపోవడం మంచిది.

బంగాళదుంపలకు దూరం ఉండండి: బంగాళదుంపల వినియోగం మధుమేహ రోగుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంగాళాదుంపలు చాలా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయన్నట్లు. ఇది కాకుండా బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి హానికరమని చెబుతున్నారు వైద్య నిపుణులు.

మొక్కజొన్న తినవద్దు: మొక్కజొన్న గ్లైసెమిక్ ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. దీనిని తినాలని అనుకుంటే తినాలనుకుంటే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో కలుపుకుని తినండి.

ఇవి కూడా చదవండి

బఠానీలు తినడం మానుకోండి: బఠానీలలో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయట. అందుకే ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు వీటిని దూరంగా ఉండటం మంచిది.

కూరగాయల రసం తాగవద్దు: పచ్చి కూరగాయల రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఈ పానీయంలో ఫైబర్ లోపం చాలా ఉంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ జ్యూస్ తాగే బదులు వాటిని డైట్ లో చేర్చుకుంటే మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us