కాల్షియం, పొటాషియం వంటి మూలకాలతో కూడిన గుడ్లు మంచి ఆహారం. NCBI నివేదిక ప్రకారం, గుడ్డు ప్రోటీన్ పిల్లల ఎత్తును పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఆహార కోరికలను అణిచివేస్తుంది. ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాలుగా గుడ్లు తింటారు. బరువు తగ్గేవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. అదే సమయంలో బరువు పెరగడానికి, పచ్చసొన తినడం మంచిది . కానీ గుడ్డులోని పచ్చసొన తినడం మనకు ఆరోగ్యకరమా లేదా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఈనేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన వైద్యురాలు ప్రియాంక షెరావత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో గుడ్డు పచ్చసొన గురించి పూర్తి సమాచారం ఇవ్వబడింది. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన వేర్వేరుగా ఉన్నప్పటికీ, వాటి లక్షణాలు దాదాపు ఒకే విధంగా డాక్టర్ తెలిపారు. అలాగే కోడిగుడ్డులోని తెల్లసొన ఎంత ఆరోగ్యకరమో పచ్చసొన తింటే కూడా అంతే ఆరోగ్యకరమంటున్నారు. గుడ్డులో విటమిన్లు A, E, Kతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఒమేగా-3 సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇక గుడ్డు పచ్చసొనలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే పోషకం. అంతేకాకుండా థైరాయిడ్ ఆరోగ్యంలో కూడా సెలీనియం సహాయపడుతుంది. శరీరంలో సెలీనియం లోపం వల్ల వికారం, వాంతులు, తలనొప్పి ప్రారంభమవుతాయి. ఒక గుడ్డులో 55 కేలరీలు, 2.5 గ్రాముల ప్రోటీన్, 4.5 గ్రాముల కొవ్వు అలాగే 0.61 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గుడ్డు పచ్చసొనను ఉడకబెట్టుకొని తినడం ఉత్తమ మార్గం. అలాగే సగం ఫ్రై రకం డిష్ తినవచ్చు. జిమ్ లేదా వ్యాయామాలను అనుసరించే వారు పచ్చి గుడ్డును పాలలో కలిపి తాగడం ఎంతో మంచిది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి