Liver Health: ఈ ఫ్రూట్స్ తిన్నారంటే లివర్ కడిగినట్టు క్లీన్ అవుతుంది!

శరీరంలో అనేక ముఖ్యమైన భాగాలు ఉంటాయి. శరీరంలో ప్రతీ భాగం కూడా ముఖ్యమే. దేని పని అది చేస్తూ ఉంటుంది. అయితే వీటిల్లో మెదడు, కిడ్నీలు, హార్ట్, లివర్ మరింత ముఖ్యం. ఈ శరీర భాగాల్లో ఏమాత్రం తేడా వచ్చినా.. శరీర ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది లివర్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. లివర్ అనేది శరీరంలో రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంటుంది. ఒకే సమయంలో ఎన్నెన్నో..

Liver Health: ఈ ఫ్రూట్స్ తిన్నారంటే లివర్ కడిగినట్టు క్లీన్ అవుతుంది!
Liver Health
Follow us

|

Updated on: Jun 17, 2024 | 3:19 PM

శరీరంలో అనేక ముఖ్యమైన భాగాలు ఉంటాయి. శరీరంలో ప్రతీ భాగం కూడా ముఖ్యమే. దేని పని అది చేస్తూ ఉంటుంది. అయితే వీటిల్లో మెదడు, కిడ్నీలు, హార్ట్, లివర్ మరింత ముఖ్యం. ఈ శరీర భాగాల్లో ఏమాత్రం తేడా వచ్చినా.. శరీర ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది లివర్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. లివర్ అనేది శరీరంలో రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంటుంది. ఒకే సమయంలో ఎన్నెన్నో పనులను నిర్వర్తిస్తూ ఉంటుంది. కండరాలు, కణ జాలాలు పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. తినే ఆహారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంది.

అదే విధంగా గ్లూకోజ్ స్థాయిలను కూడా స్టోర్ చేసి.. శరీరానికి అవసరం అయినప్పుడు అందిస్తుంది. ఇలా లివర్ చాలా పనులే చేస్తుంది. అయితే మన దేశంలో చాలా మంది లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోతున్నారు. కేవలం శరీరానికే కాకుండా లివర్‌కు కూడా కొన్ని రకాల పోషకాలు అవసరం. మరి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. పనులను చక్కగా నిర్వర్తించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

యాపిల్:

ప్రతి రోజూ ఓ యాపిల్ తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, డాక్టర్‌తో పని ఉండదని ఆరోగ్య నిపుణులు ఊరికే చెప్పలేదు. యాపిల్ తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజుకొక యాపిల్ తింటే లివర్‌కి సంబంధించిన సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. యాపిల్ తినడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. లివర్ చక్కగా పని చేస్తుంది. లివర్ ఫ్యాట్‌ను కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆవకాడో:

ఆవకాడోలో ఎన్నో రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆవకాడోలో ఉంటే ఆరోగ్యకరమైన కొవ్వులు.. లివర్‌కి రక్షణ కవచంలా ఉంటాయి. లివర్‌లో ఉండే చెడు కొవ్వులను బయటకు పంపుతుంది. ఆస్టియోపోరోసిస్ అనే ముప్పు నుంచి లివర్‌ని కాపాడుతుంది.

బెర్రీస్:

బెర్రీస్‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిల్లో ఏది తిన్నా లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు చక్కగా పని చేస్తుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి లివర్‌పై ఒత్తిడి పడకుండా చేస్తుంది.

బొప్పాయి:

లివర్‌ని ఆరోగ్యంగా ఉంచడంలో బొప్పాయి కూడా సహాయ పడుతుంది. బొప్పాయిలో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు.. లివర్‌పై పని భారాన్ని తగ్గిస్తాయి. లివర్ ఫ్యాట్‌ను కూడా దూరం చేస్తాయి. లివర్ ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తాయి. అదే విధంగా బ్లూ బెర్రీస్, సిట్రస్ పండ్లు, కివీ కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!