26 June 2024
అది ఒక చెత్త ఎయిర్ పోర్ట్.. హీరోయిన్ అతిది ఆవేదన..
Rajitha Chanti
Pic credit - Instagram
హీరోయిన్ అదితి రావు హైదరీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇటీవల హీరోయిన్ సోనాక్షీ సిన్హా రిసెప్షన్ వేడుకలో ప్రియుడు సిద్ధార్థ్‌తో కలిసి సందడి చేసిన ఫోటోస్, వీడియోస్ వైరలయ్యాయి.
తాజాగా యూకే విమానాశ్రయంలో అతిది రావు హైదరీకి చెదు అనుభవం ఎదురైనట్లు తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది ఈ బ్యూటీ.
యూకే విమానాశ్రయంలో తన లగేజీ మాయమైందని, అందుకోసం గంటల తరబడి ఎదురుచూస్తూ కూర్చోవాల్సి వచ్చిందని తెలిపింది.
అధికారులను అడిగితే వారు చేతులెత్తేశారని, సంబంధిత ఎయిర్ లైన్ ను సంప్రదించామన్నారని పేర్కొన్నారు హీరోయిన్ అదితి.
ఇంత చెత్త ఎయిర్ పోర్టును తానెప్పుడూ చూడలేదంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. గంటల కొద్ది టైమ్ వెస్ట్ అయ్యిందట.
విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని మండిపడింది. ఇంతకీ లగేజీ దొరికిందా అనేది తెలియలేదు.
అదితి రావు హైదరీ హీరో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరు పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.