Stale Roti: నిన్నటి చపాతీలను బయట పడేస్తున్నారా.. అవి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవుతారు..

సాధారణంగా మనం ఫ్రెష్‌గా లేదా తాజా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినమని సలహా ఇస్తాం. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే వేడి వేడిగా రొట్టెలలు/చపాతీలను తింటే మంచిది అని అనుకుంటాం.. కానీ నిన్నటి రొట్టెలు కూడా ఆరోగ్యానికి మంచిదే అంటే..

Stale Roti: నిన్నటి చపాతీలను బయట పడేస్తున్నారా.. అవి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవుతారు..
Stale Roti

Updated on: Jan 22, 2023 | 5:17 PM

చపాతి/ రొట్టె గోధుమ పిండితో చేయు వంటకం. దీనిని అల్పాహారంగా కొందరు తింటే.. మరి కొందరు దీనిని భోజనంగా తీసుకుంటారు. చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. ఉత్తర భారత దేశములో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్రధాన ఆహారము. గ్యాస్‌పై అమర్చిన పాన్ నుంచి నేరుగా ప్లేట్‌లో వేడి వేడి రోటీలను తినడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఫ్రెష్‌గా ఉంటే ఒకటి రెండు రోటీలు అదనంగా తింటే మనకి అభ్యంతరం ఉండదు.. అయితే అది నిన్నటివి చూడగానే ముక్కు, కనుబొమ్మలు ముడుచుకుపోతాయి. పాత రోటీ తినడానికి ఇంట్లో ఎవరూ లేనప్పుడు చెత్తబుట్టలో పడేస్తాం. నిన్నటివి  తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని మాత్రమే మనకు తెలుసు. అయితే నిన్నటి చపాతి/రెట్టె తినడం వల్ల కలిగే  ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా తినకుండా ఉండలేరు.

నిన్నటి రొట్టె తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

1. బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయబడుతుంది

చాలా మంది తమ శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు పాత రోటీలను క్రమం తప్పకుండా తింటే.. శరీర ఉష్ణోగ్రత రోజంతా సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో హీట్ స్ట్రోక్ ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

2. బరువు

పెరగడానికి ఉపయోగపడుతుంది లక్షలాది ప్రయత్నాలు చేసినా బరువు లేదా కండరాలను పెంచుకోలేని వ్యక్తులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి నిన్నటి రోటీలు మీ ఆరోగ్యానికి ఉపశమనం కలిగించగలవు. ఇందులో ఫైబర్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి.. కండరాల పెరుగుదలకు దారితీస్తుంది.

3. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్..

ఈ రోజుల్లో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మంది హై బ్లడ్ ప్రెజర్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దీని నుంచి ప్రయోజనం పొందడానికి.. పాలను మరిగించిన తర్వాత దానిని చల్లబరుస్తుంది. దానిలో పాత రోటీని కలపండి.

4. ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందుతాం

చాలా సార్లు మనం ఇంట్లో లేదా పార్టీలలో అధికంగా నూనె, కారంగా ఉండే ఆహారాన్ని తింటాం. దాని కారణంగా ఎసిడిటీ సమస్య వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితిలో.. నిన్నటి రొట్టెలు తినడం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అసిడిటీ నుంచి ఉపశమనం పొందడమే కాదు. ఆరోగ్యం కూడా మీకు సొంత అవుతుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం