Virus: మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్న చైనా.. వెలుగులోకి 8 కొత్త వైరస్‌లు.

అయితే తాజాగా ఓ వార్త మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు హైనాన్‌లో ఎనిమిది కొత్త వైరస్‌లను గుర్తించారు. ఇప్పుడీ వార్త అలజడి రేపుతోంది. అయితే ఈ వైరస్‌ జాతులను ఆపకపోతే మనుషులకు సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు చైనా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ అధ్యయనంలో తేలిన వివరాలను శాస్త్రవేత్తలు వైరోలాజిక...

Virus: మరోసారి ప్రపంచాన్ని భయపెడుతున్న చైనా.. వెలుగులోకి 8 కొత్త వైరస్‌లు.
Representative Image

Updated on: Oct 25, 2023 | 1:03 PM

కరోనా మహమ్మారి సృష్టించిన అలజడి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ మాయదారి వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సమాజం మొత్తం స్థంభించిపోయింది. అన్ని రంగాలపై ప్రభావం చూపిన కోవిడ్19 వైరస్‌ చైనాలో వెలుగులోకి వచ్చిన విషయం ప్రపంచానికి తెలిసిందే.

అయితే తాజాగా ఓ వార్త మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు హైనాన్‌లో ఎనిమిది కొత్త వైరస్‌లను గుర్తించారు. ఇప్పుడీ వార్త అలజడి రేపుతోంది. అయితే ఈ వైరస్‌ జాతులను ఆపకపోతే మనుషులకు సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు చైనా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. ఈ అధ్యయనంలో తేలిన వివరాలను శాస్త్రవేత్తలు వైరోలాజిక సినికా అనే జర్నలో ప్రచురించారు. ఎలుకల నుంచి సేకరించిన షాంపిల్స్‌లో శాస్త్రవేత్తలు ఈ వైరస్‌లను గుర్తించారు.

ఇందులో బాగంగా శాస్త్రవేత్తలు 2017 నుంచి 2021 మధ్య హైనాన్‌లో ఉన్న ఎలుకల నుంచి 682కిపైగా గొంతు నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. ఈ పరీక్షల్లో కొత్తగా 8 వైరస్‌ల ఉనికి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో బీటా కోరోనావైరస్ అనే కరోనావైరస్ కుటుంబానికి చెందిన వైరస్‌ ఉండడం ఇప్పుడు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఈ ఎలుకల్లో కరనో వైరస్‌లు, ఫ్లేవి వైర్‌లు, పార్వో వైరస్‌లు, ఆస్ట్రో వైరస్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఇక జాండిల్స్‌, డెంగ్యూకి కారణమయ్యే కొత్త ఫ్లేవి వైరస్‌లు కూడా ఎలుకల్లో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇక ఎలుకల్లో గుర్తించిన పార్వో వైరస్‌లు మనుషుల్లో ఫ్లూ, అర్థరైటీస్‌ వంటి లక్షణాలకు దారి తీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇక చర్మం, శ్లేష్మ పొరల్లో నిరంతర ఇన్‌ఫెక్షన్లకు కారణమయ్యే రెండు పాలిల్లోమా వైరస్‌లను సైతం గుర్తించారు. పొడవాటి తోక కలిగిన ఎలుక జాతుల్లో కొత్త ఫ్లేవి వైరస్‌, పార్వో వైరస్‌లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సైన్స్ వార్తల కోసం క్లిక్ చేయండి..