Cinnamon Water
Cinnamon Water Benefits: దాల్చిన చెక్క.. అద్భుతమైన రుచి.. సువాసనకు ప్రసిద్ధి. అందుకే అనేక రకాల వంటకాల రుచిని మెరుగుపరచడానికి దీనిని ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సహా యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందుకే దాల్చినచెక్కను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు, పోషకాలు పలు సమస్యల నివారణకు సహాయపడతాయి. అంతేకాకుండా.. దాల్చిన చెక్క నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. రోజూ ఒక గ్లాసు దాల్చినచెక్క నీరు.. పరగడుపున తాగితే ఎన్నికో సమస్యలు దూరమవుతాయి. గ్లాసు దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి..
దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది: దాల్చిన చెక్కలో సహజమైన జీర్ణక్రియ లక్షణాలు ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీటిని రోజూ తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు చాలా వరకు నయమవుతాయి.
- జ్ఞాపకశక్తి బలపడుతుంది: రోజూ దాల్చిన చెక్క నీటిని తాగితే మెదడు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది.. ఇంకా జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
- గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది: దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగే వారి సిరల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నిర్వహించడంలో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
- రోగనిరోధక శక్తి పెరుగుతుంది: యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ లక్షణాలు దాల్చిన చెక్కలో పుష్కలంగా ఉన్నాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా జలుబు, దగ్గు, ఫ్లూ, జ్వరం వంటి వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.
- చర్మానికి మేలు చేస్తుంది: దాల్చిన చెక్క నీరు మంటను తగ్గిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలతోపాటు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
నీటిలో దాల్చిన చెక్క వేసి మరగించిన అనంతరం గోరువెచ్చగా ఉన్న నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..