బెల్లం మాదిరి తియ్యగా ఉండదు కానీ అల్లం చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. కాస్త తలనొప్పిగా అనిపించినా.. చిరాగ్గా అనిపించినా.. గొంతులో గరగరగా ఉన్నా అల్లం టీ తాగితే స్వాంతన లభిస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ దండిగా ఉంటాయి. అల్లంతో అజీర్తి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులకు ప్రాబ్లమ్స్ తగ్గుముఖం పడతాయి. అల్లం ఆహారంలో చేర్చుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అల్లం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలో అల్లం సాయపడుతుంది
బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి కూడా అల్లం బాగా ఉపయోగపడుతుంది
వర్కవుట్స్ వల్ల కలిగే కండరాల నొప్పలకు అల్లం మంచి మెడిసిన్
వికారంతో బాధపడుతున్నవారు టీలో కాస్త అల్లం వేసుకుని తాగితే చాలు రిలీఫ్ ఉంటుంది