Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

నేనూ బ్యాట్ ఝుళిపిస్తా.. బుడతడా.? మజాకా?

Child In Diapers Plays Perfect Cricket Shots Vaughan Shares Video, నేనూ బ్యాట్ ఝుళిపిస్తా.. బుడతడా.? మజాకా?

క్రికెట్.. క్రికెట్.. క్రికెట్.. పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలు సైతం ఇష్టపడే ఫేవరేట్ క్రీడ. క్రికెట్ మ్యాచ్ జరిగితే చాలు.. స్టేడియంలు యువతతో హోరెత్తిపోతాయి. ఇండియన్స్‌కు ఇది కేవలం అసాధారణ క్రీడ మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ కూడా. ఇక ఈ స్పోర్ట్‌కు గాడ్ సచిన్ టెండూల్కర్ అని అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా డైపర్స్ వేసుకున్న ఓ బుడతడు తన చిట్టి చేతులతో బ్యాట్‌ను ఝుళిపిస్తూ భారీ హిట్టింగ్ ఇస్తున్న వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ముఖకవళికల్లో స్టీవ్ స్మిత్‌ను.. షాట్స్ ఎంపికలో సచిన్ టెండూల్కర్‌ను.. ఇక టైమింగ్‌లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని గుర్తు చేస్తూ ఆ బుడతడు ఆడుతున్న స్ట్రోక్ ప్లేకు నెటిజన్లతో పాటు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా ముగ్దుడైపోయాడు. ‘ఈ గడుగ్గాయి బహుశా ఇంగ్లాండ్ గడ్డపై పుట్టినట్లు ఉన్నాడు.. మొత్తం బ్యాటింగ్‌ నరనరాల్లో చొచ్చుకుపోయిందంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ఈ బుడతడు ఒక్కడే కాదు.. అటు ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనయ కూడా ‘ఐ యామ్ విరాట్ కోహ్లీ’ అంటూ తన బ్యాటింగ్‌ను చూపించిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియోను తల్లి కాండీస్ వార్నర్ షేర్ చేయగా.. దీనికి వేల సంఖ్యలో లైకులు, షేర్లు రావడం గమనార్హం. లేట్ ఎందుకు మీరు కూడా ఆ రెండు వీడియోలను ఒకసారి చూడండి.