ఆన్‌లైన్ మోసాల‌పై పోలీసు నిఘా.. 392 మొబైల్ సిమ్ కార్డులు డీయాక్టివేట్

పెరిగిపోయిన టెక్నాల‌జీని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు కేటుగాళ్లు ఆన్‌లైన్ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌ల రూపంలో అమాయ‌కుల‌ను నిలువునా ముంచేస్తున్నారు....

ఆన్‌లైన్ మోసాల‌పై పోలీసు నిఘా.. 392 మొబైల్ సిమ్ కార్డులు డీయాక్టివేట్
Follow us

|

Updated on: Jun 20, 2020 | 9:08 PM

పెరిగిపోయిన టెక్నాల‌జీని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు కేటుగాళ్లు ఆన్‌లైన్ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌ల రూపంలో అమాయ‌కుల‌ను నిలువునా ముంచేస్తున్నారు. ఫేక్ గిఫ్ట్‌లు, ఆఫర్ల పేరిట సైబ‌ర్ నేర‌గాళ్లు స్మార్ట్ గా ప్ర‌జ‌ల్ని దోచుకుంటున్నారు. దీంతో అప్ర‌మత్త‌మైన పోలీసులు ఆన్‌లైన్ మోస‌గాళ్ల ప‌నిప‌డుతున్నారు. హర్యానా పోలీసులు ఇటువంటి వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటున్నారు. న‌కిలీ డాక్యుమెంట్లు స‌మ‌ర్పించి పొందిన 392 మొబైల్ సిమ్ కార్డుల‌ను పోలీసులు డియాక్టివేట్ చేశారు. ఇవ‌న్నీ మే నేల 12 నుంచి జూన్ 15 వ‌రకు అక్ర‌మంగా పొందినట్లు గుర్తించిన పోలీసులు వాటిని డియాక్టివేట్ చేశారు.

ఈ మేర‌కు అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నవదీప్ సింగ్ మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నట్లు గుర్తించామ‌ని, సైబర్ క్రైమ్ యూనిట్ ద‌ర్యాప్తు అనంత‌రం 685 మొబైల్ సిమ్ కార్డులు ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా జారీ అయినట్లు తేలింద‌న్నారు. నకిలీ ఐడీ ప్రూఫ్‌లను సమర్పించి, సిమ్ కార్డులను పొంది, వాటి ద్వారా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. టెలికమ్యూనికేషన్ల శాఖను సంప్రదించి, 392 మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయించినట్లు వెల్ల‌డించారు. సైబ‌ర్ నేర‌గాళ్ల విష‌యంలో ప్ర‌జ‌లు పూర్తి అప్ర‌మ‌త్త‌తో ఉండాల‌ని సూచించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు