Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

ట్రంప్ ను ఉరిమి చూసిందెవరు ? 16 ఏళ్ళ చిన్నదే మరి ?

క్లైమేట్ ఛేంజ్ (వాతావరణ మార్పులు, పరిరక్షణ) పై న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి సమ్మిట్ లో జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు మొక్కుబడిగా వఛ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోపంతో, ఉరిమి చూసిందో చిన్నారి. తన ముందునుంచి ఆయన మందీ మార్బలంతో వెళ్తుండగా.. పళ్ళు బిగబట్టి.. కళ్ళు ఉరుముతూ తీక్షణంగా చూసింది. ఆమె ఎవరో కాదు.. 16 ఏళ్ళ స్వీడిష్ బాలిక
గ్రెటా థన్ బర్గ్.. ట్రంప్ ను ఆ అమ్మాయి కసిగా చూస్తున్న దృశ్యం తాలూకు వీడియో వైరల్ అయింది. మానవజాతికి పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు పట్టించుకోవడంలేదని ఈ అమ్మాయి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. ప్రతి శుక్రవారం స్వీడిష్ పార్లమెంట్ ఎదుట ఆమె ధర్నా చేస్తోంది. అలాంటి ఈ సాహస బాలిక.. స్వీడన్ నుంచి న్యూయార్క్ కు కాలుష్యం వెదజల్లని పడవలో ప్రయాణించి వచ్చిందట. అసలు ఈ సమ్మిట్ లో మాట్లాడే ఉద్దేశమే తనకు లేదని, తన మాటలను ముఖ్యంగా ట్రంప్ పట్టించుకోనప్పుడు ఆయనతో తాను మాట్లాడి మాత్రం ప్రయోజనమేమిటని గ్రెటా… గతంలోనే సీబీఎస్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. మొదట సైన్స్ ఏం చెబుతోందో వినండి అన్నదే తాను ట్రంప్ కు ఇస్తున్న మెసేజ్ అని, కానీ ఆయన దీన్ని వింటాడన్న నమ్మకం తనకు లేదని ఆమె తెలిపింది. ఐరాసలో క్లైమేట్ ఛేంజ్ పై మాట్లాడేందుకు వఛ్చిన ప్రపంచ నాయకులను గ్రెటా దుమ్మెత్తిపోసింది. ‘ మీరు డబ్బుకు, కాల్పనిక జగత్తుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ భూమండలానికి కలిగే ప్రమాదాలను పట్టించుకోవడం లేదు ‘ అంటూ ఒక దశలో కన్నీటి పర్యంతమైంది.
అటు-ఈ సమ్మిట్ కు వఛ్చిన ట్రంప్ అక్కడ సుమారు 10, 15 నిముషాలు మాత్రమే గడిపారు. గ్రెటా తీరు పట్ల ఆయన వెటకారంగా స్పందించాడు. ‘ చూడబోతే ఈ అమ్మాయి హ్యాపీ యంగ్ గర్ల్ గా ఉందని, ప్రకాశవంతమైన, వండర్ఫుల్ ఫ్యూచర్ కోసం తహతహలాడుతున్నట్టు ఉందని ‘ ఆయన ట్వీట్ చేశాడు. తరచూ తన కళ్ళు మూసుకుంటూ… అప్పుడప్పుడు వాచీ చూసుకుంటూ కాస్త ‘ అసహనంగా ‘ ట్రంప్ గడిపాడు.
గ్రెటాతో బాటు వఛ్చిన మరో 15 మంది బాలలు ఐరాస ప్రధానకార్యదర్శికి ఓ మెమోరాండం సమర్పించారు. జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, ఆర్జెంటీనా, టర్కీ దేశాలు క్లైమేట్ క్రైసిస్ నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని, యుఎస్ వంటి దేశాలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని వారు ఈ మెమొరాండంలో పేర్కొన్నారు.