నిర్మల పథకం వల్ల పెద్దగా ఒరిగేది కల్ల.. ఆర్ధిక నిపుణుల నిట్టూర్పు

దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ఎగుమతిదారులకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా ప్రకటించిన పథకాల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆర్థిక రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఎక్స్ పోర్టర్స్ కు సంబంధించి జనవరి 1 నుంచి అమలు చేయనున్న కొత్త టాక్స్ రీ-ఫండ్ పథకం కారణంగా ప్రభుత్వంపై ఏడాదికి రూ. 50 వేల కోట్ల భారం పడుతుందని నిర్మలా సీతారామన్ ఈ నెల 14 న పేర్కొన్నారు. అయితే ఎగుమతిదారులకు దీనివల్ల పెద్దగా లాభం […]

నిర్మల పథకం వల్ల పెద్దగా ఒరిగేది కల్ల.. ఆర్ధిక నిపుణుల నిట్టూర్పు
Follow us

|

Updated on: Sep 16, 2019 | 1:20 PM

దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు ఎగుమతిదారులకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్తగా ప్రకటించిన పథకాల వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆర్థిక రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఎక్స్ పోర్టర్స్ కు సంబంధించి జనవరి 1 నుంచి అమలు చేయనున్న కొత్త టాక్స్ రీ-ఫండ్ పథకం కారణంగా ప్రభుత్వంపై ఏడాదికి రూ. 50 వేల కోట్ల భారం పడుతుందని నిర్మలా సీతారామన్ ఈ నెల 14 న పేర్కొన్నారు. అయితే ఎగుమతిదారులకు దీనివల్ల పెద్దగా లాభం లేదని, సాలుకు అదనంగా తొమ్మిది వేల కోట్లకు మించి ‘ ప్రయోజనం ‘ లభించదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రూ. 41 వేల కోట్ల ఇన్సెంటివ్ ఇస్తున్నారు. మహా అయితే ఇది 45 వేల కోట్లకు మించదు. కొత్త పథకం కూడా దాదాపు ఇదే విధంగా ఉంది అని ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్ అలోక్ చతుర్వేది విశ్లేషించారు. అసంపూర్తిగా మిగిలిన హౌసింగ్ ప్రాజెక్టులకోసం ప్రత్యేకంగా రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం ‘ విండో ‘ ను ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను తెరెసా జాన్ అనే నిపుణురాలు ప్రస్తావిస్తూ.. హౌసింగ్ కన్నా ఎగుమతుల రంగంపై దృష్టి నిలపాల్సి ఉందని, అంతే తప్ప.. ‘ గేమ్ ఛేంజర్ ‘ పై కాదని వ్యాఖ్యానించారు. నిజానికి కొత్త పథకం రియల్ ఎస్టేట్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. సౌదీలో డ్రోన్ దాడుల కారణంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, ఇది మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. గత జూన్ తో అంతమైన త్రైమాసికానికి దేశ ఆర్ధిక వృద్ది రేటు చాలావరకు తగ్గడంపట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.