గొర్రెకుంట మర్డర్స్ మిస్టరీ ..మినిట్ టూ మినిట్ ఇది జ‌రిగింది…

గొర్రెకుంట మర్డర్స్ మిస్టరీ వీడింది. తొమ్మిది కాదు… పది హత్యలు… అన్ని హత్యలు సంజయ్ కుమార్ యాదవ్ చేశాడని ఖాకీలు తేల్చారు… చదివింది మూడో తరగతే కానీ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ తో సస్పెన్స్ త్రిల్లింగ్ కిల్లర్ గా మారాడు… గొర్రెకుంట సామూహిక హత్యలపై ఫుల్ అప్డేట్స్ మీరే చూడండి…. ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 4.15 నిమిషాలు… స్పాట్ గొర్రెకుంటలోని సాయి సత్య గన్నీ ఇండస్ట్రీస్… పక్కనే ఉన్న బావిలో నాలుగు మృతదేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. […]

గొర్రెకుంట మర్డర్స్ మిస్టరీ ..మినిట్ టూ మినిట్ ఇది జ‌రిగింది...
Follow us

|

Updated on: May 25, 2020 | 9:16 PM

గొర్రెకుంట మర్డర్స్ మిస్టరీ వీడింది. తొమ్మిది కాదు… పది హత్యలు… అన్ని హత్యలు సంజయ్ కుమార్ యాదవ్ చేశాడని ఖాకీలు తేల్చారు… చదివింది మూడో తరగతే కానీ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ తో సస్పెన్స్ త్రిల్లింగ్ కిల్లర్ గా మారాడు… గొర్రెకుంట సామూహిక హత్యలపై ఫుల్ అప్డేట్స్ మీరే చూడండి….

  • ఈ నెల 21వ తేదీ గురువారం సాయంత్రం 4.15 నిమిషాలు… స్పాట్ గొర్రెకుంటలోని సాయి సత్య గన్నీ ఇండస్ట్రీస్… పక్కనే ఉన్న బావిలో నాలుగు మృతదేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. -మృతులంతా ఒకే కుటుంబం పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కార్మికులు మక్సుద్, అతని భార్య నిషా ఆలం, కూతురు బస్రా ఖాతూన్ , మనవడు మూడేళ్ళ బాలుడని గుర్తించారు… -మృతులంతా వలస కూలీలు మరోవైపు లాక్ డౌన్.. ఈ నేపథ్యంలో ఆకలి చావులని అంతా భావించారు… సాయంత్రం 6.30నిమిషాలకు నాలుగు డెడ్ బాడీస్ ను ఎంజీఎం మార్చురీకి చేర్చారు..
  • మరుసటి రోజు శుక్రవారం 22వ తేదీ ఉదయం 6.35 నిమిషాలు… అనూహ్యంగా అదే బావిలో మరోవ్యక్తి మృతదేహం పైకి తేలింది.. పోలీసులతో పాటు అంతా అవాక్కయ్యారు… బావిలో ఇంకా ఏదైనా ఆధారాలు లభ్యమవుతాయి కావచ్చని భావించారు.. ఉదయం 8గంటల నుండి మోటర్ల సహాయంతో నీళ్ళు బ‌య‌ట‌కు తోడ‌టం మొదలుపెట్టారు… ఈ క్రమంలో ఊహించని విదంగా శ‌వాలు బయటపడ్డాయి.. ఒకటి కాదు.. రెండు కాదు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి… గురువారం నాలుగు, శుక్రవారం ఐదు మృతదేహాలు.. మృతుల సంఖ్య 9కి చేరింది… సమ్ థింగ్ ఈజ్ దేర్… అని భావించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు…
  • శనివారం ఉదయం నుండి విచారణ చేపట్టిన పోలీస్ బృందాలు…చిన్న అనుమానంతో బీహార్ కార్మికుడు సంజయ్ కుమార్ యాదవ్ తో పాటు, మరో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు… పోలీస్ విచారణలో నివ్వెర‌పోయే నిజాలు వెలుగు చూశాయి…
  • హంతకుడు ఒక్కడే కానీ తొమ్మిది కాదు.. పది హత్యలని తేలింది…
  • మార్చి 7వ తేదీన చేసిన ఓ హత్యానేరం నుండి తప్పించు కోవడం కోసం గొర్రెకుంటలో తొమ్మిది హత్యలు చేశాడు సంజయ్ కుమార్ యాదవ్…
  • ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన తన ప్రియురాలు రఫీకాను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఆమె కూతురును లోబర్చుకున్నాడు.. ఈ క్రమంలో రఫీక నిలదీయడంతో ఆమెను తన సొంత‌ రాష్ట్రానికి తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు…ప్లాన్ ప్రకారం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైల్ లో తీసుకెళ్లాడు.. అప్పటికే రఫీకా హత్యకు స్కెచ్ వేసిన సంజయ్ కుమార్ యాదవ్… ఆమెకు మజ్జిగ ప్యాకెట్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు.. ఆమె రైల్లో నిద్రిస్తున్న క్రమంలో తెల్లవారుజామున 3గంటల సమయంలో చున్నీతో గొంతు నులిమి చంపేశాడు.. రఫీక డెడ్ బాడీని నిడుదవోలు సమీపంలో రైల్ లో నుండి నెట్టేశాడు.. అక్కడి పోలీసులు రఫీకా డెడ్ బాడీని గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నారు..
  • నాలుగురోజుల తర్వాత తిరిగివచ్చిన సంజయ్ కుమార్ యాదవ్ రఫీకా కుమార్తెతో ఎప్పటిలాగే తన కోరికలు తీర్చుకుంటున్నాడు… ఈ క్రమంలో రఫీక అక్కా, బావ.. మక్సుద్ – నిషా ఆలం… రఫీక ఏమైందని ప్రశ్నించారు
  • రెండు నెలల నుండి రఫీక ఆచూకీ కోసం సంజయ్ కుమార్ యాదవ్ వెంట‌బ‌డుతున్నారు. అతనిపై పోలీసులకు పిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.. ఈ క్రమంలో క్రిమినల్ సంజయ్ కుమార్ యాదవ్… ఆ హత్యానేరం నుండి తపించుకోవడం కోసం మరో స్కెచ్ వేశాడు.. మక్సూద్ కుటుంబ సభ్యులందరినీ కడతేర్చడానికి ప్లాన్ వేశాడు..
  • తన ప్లాన్ ప్రకారం మే 16వ తేదీన హన్మకొండలోని మూడు మెడికల్ షాపుల్లో నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు.. అదును కోసం ఎదురుచూస్తున్న సంజయ్ కి 20వ తేదీన మక్సూద్ పెద్డకొడుకు బర్త్ డే వేడుకలు డెత్ స్పాట్ గా కలిసొచ్చింది.. తన ప్లాన్ ప్రకారం సాయంత్రం 6నుండి 7.30 గంటల మధ్య నిద్రమాత్రలు పొడిగా చేసుకొని వచ్చాడు..అంతా ఇంటిముందు బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో వారు వండుకున్న అన్నంలో మత్తుమందు పౌడర్ కలిపాడు.. వీరితోపాటు ఇదే గన్నీసంచుల గొడౌన్ లో పనిచేస్తున్న బిహార్ కూలీలు శ్రీరామ్, శ్యామ్ కుమార్ ల అన్నంలో కలిపాడు…
  • అంతా మత్తులోకి చేరుకోగానే తన క్రిమినల్ ప్లాన్ అమలు చేశాడు..
  • అర్ధరాత్రి 12.30నిమిషాల నుండి తెల్లవారుజామున 5గంటల మధ్య ఈ తొమ్మిది మందిని బ‌స్తాసంచుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి గొడౌన్ పక్కనే ఉన్న బావిలో వేశాడు.. అంతా బ్రతికి వుండగానే బావిలో వేశాడు…
  • అంతు చిక్కని మిస్టరీగా మిగిలిన ఈ కేసును వరంగల్ పోలీసులు కేవలం రెండురోజుల వ్య‌వ‌ధిలోనే తేల్చారు…
  • సోమవారం సాయంత్రం 4గంటలకు నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు… తొమ్మిది కాదు పది హత్యలని.. అన్ని హత్యలు చెంసింది ఒక్కడే అని తేల్చారు… ఆ కిల్లర్ సంజయ్ కుమార్ యాదవ్ కు కఠిన శిక్ష పడేలా చేస్తామని ప్రకటించిన వరంగల్ పోలీస్ కమిషనర్… ఈ కేసు మిస్టరీని ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు…

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో