మురికివాడల్లో ఒక్కపూట నిద్రపోండి.. గ్రేటర్ క్యాడర్ కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపు..

గ్రేటర్ పరిధిలో పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

  • Balaraju Goud
  • Publish Date - 9:53 pm, Tue, 24 November 20

గ్రేటర్ పరిధిలో పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బస్తీ నిద్ర చేయాలని పిలిపునిచ్చింది. ఈమేరకు పార్టీ క్యాడర్ కు దిశానిర్ధేశం చేశారు రాష్ట్ర పార్టీ చీఫ్ బండి సంజయ్.

జిహెచ్‌ఎంసి పరిథిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు మురికివాడలతో పర్యటించి వారితో మాట్లాడాలని, మురికివాడల్లో మంగళవారం నిద్రపోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్ నాయకులతో బిజెపి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్ టెలికాన్పరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులను మురికివాడల్లో ఉండాలని, నివాసితులతో సన్నిహితంగా మాట్లాడి వారి సమస్యలు, డిమాండ్లను తెలుసుకోవాలన్నారు. అలాగే రాత్రిపూట అక్కడే నిద్రపోయి ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. తానూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని సంజయ్ చెప్పారు. పోటీ పడుతున్న అభ్యర్థులు గెలిస్తే వారానికి ఒకసారైనా మురికివాడల్లో బస్తీ నిద్ర కార్యక్రమం కొనసాగించాలని ఆయన ఆదేశించారు.