అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ ఫైట్

జీహచ్ ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శేరిలింగంపల్లి జోన్‌లో నాలుగు రోజుల్లో 30 భవనాలకు చెందిన 140 స్లాబ్‌లను కూల్చివేశారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంలోని అక్రమ నిర్మాణాలను..

అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ ఫైట్
Follow us

|

Updated on: Jul 31, 2020 | 10:25 PM

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై జీహచ్ ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శేరిలింగంపల్లి జోన్‌లో నాలుగు రోజుల్లో 30 భవనాలకు చెందిన 140 స్లాబ్‌లను కూల్చివేశారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నగరంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.

శేరిలింగంపల్లి, అయ్యప్ప సొసైటీలో ఇప్పటికే అక్రమ నిర్మాణాలను తొలిగించినట్లు చెప్పారు. అదే విధంగా అనుమతులను మించి నిర్మించిన అంతస్తులను, ఎక్కువ విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కడుతున్న నిర్మాణాలను కూడా కూల్చి వేస్తున్నామని లోకేష్ కుమార్ వివరించారు. అనుమతులు లేకుండా నిర్మించిన ప్లాట్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి వాటినే కొనుగోలు చేయండి…

జీహెచ్ఎంసీ ఇచ్చిన ఆక్యుపెన్సి స‌ర్టిఫికెట్ క‌లిగిన ప్లాట్ల‌ను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఆక్యుపెన్సి స‌ర్టిఫికేట్లు పొంద‌ని భ‌వ‌నాల‌కు ప్రాప‌ర్టీ ట్యాక్స్‌ పెనాల్టిలు, వాట‌ర్ బిల్లు పెనాల్టిలు ఉంటాయన్నారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో నిర్మాణ అనుమ‌తుల‌తో పాటు ఆక్యుఫెన్సి స‌ర్టిఫికేట్ల జారీకి సంబంధించిన వివ‌రాలు ఉంటాయని కమిషనర్ తెలిపారు.