7 ఏళ్ల తర్వాత జగన్‌తో వంశీ మీటింగ్.. పార్టీ మార్పుపై ఏమన్నారంటే..?

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఆయన దాదాపు పార్టీ మార్పుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ మార్పుపై దీపావళి తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన అన్నారు. 2006లో రాజకీయాల్లో కొనసాగుతున్నానని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 4 నెలలుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ సీఎం జగన్‌కు చెప్పానని, ఆయన సానుకూలంగా […]

7 ఏళ్ల తర్వాత జగన్‌తో వంశీ మీటింగ్.. పార్టీ మార్పుపై ఏమన్నారంటే..?
Follow us

|

Updated on: Oct 25, 2019 | 11:30 PM

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఆయన దాదాపు పార్టీ మార్పుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ మార్పుపై దీపావళి తర్వాత క్లారిటీ ఇస్తానని ఆయన అన్నారు. 2006లో రాజకీయాల్లో కొనసాగుతున్నానని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 4 నెలలుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ సీఎం జగన్‌కు చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు. జగన్‌తో వల్లభనేని వంశీ సమావేశమైన విషయం తెలిసిందే. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం వద్దకు వంశీ వెళ్లారు. అరగంట పాటు సీఎంతో వంశీ సమావేశమయ్యారు. తనపై పెట్టిన అక్రమ కేసులను జగన్‌కు వివరించారు. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, జగన్‌తో వంశీ చెప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై జగన్ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
అయితే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని జగన్ సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు వంశీ కూడా అంగీకరించినట్లు సమాచారం. దీపావళి తర్వాత టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అంతకుముందు వంశీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కూడా భేటీ అయ్యారు. అన్నీ అంశాలపై సమాలోచనలు చేసిన వంశీ వైసీపీ గూటికి చేరేందుకు మార్గం సుగుమం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దాాదాపు ఏడేళ్ల తర్వాత జగన్‌తో వంశీ భేటీ: 

ఏడేళ్ల క్రితం విజయవాడలో రోడ్డుమీద జగన్‌, వంశీ హగ్‌ చేసుకున్నారు. అప్పట్నుంచే వంశీ వైసీపీలో చేరతారని వార్తలు వినిపించాయి. అప్పుడు కేవలం అనుకోకుండా దారిలో కలిశానని..పొలిటికల్‌గా తన జీవితమంతా టీడీపీలోనే ఉంటానని వంశీ చెప్పుకొచ్చారు. భేటీ సమయంలో  నియోజకవర్గ అభివృద్ధా.. లేక వైసీపీలోకి చేరే అంశమా? అనే రెండు కోణాలతో పాటు..ఇటీవల వంశీపై నకిలీ పట్టాల వ్యవహారంపై కేసు నమోదు చేయడం గురించి చర్చించేందుకు కలిశారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. చివరకు అతను పార్టీలో చేరికకే  అని క్లారిటీ వచ్చేసింది.

వంశీ జగన్‌ను విజయవాడలో కలిసినప్పటి ఫోటో: