ఏపీలో నలుగురు మంత్రులకు ఉద్వాసన? జగన్ సంచలన నిర్ణయం..నిజమా?

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి దాదాపు నెలన్నర అవుతోంది. ఇంకా కేబినెట్ పూర్తిగా కుదురుకోలేదు.. అప్పుడే కొంతమంది మంత్రులను తప్పించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అవినీతి రహిత పాలనే తమ లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. అవినీతి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే వారిని కేబినెట్ నుంచి తప్పించడానికి రంగం సిద్ధం చేశారని సమాచారం. సీఎం జగన్ మొదటి నుంచి తమ హయాంలో అవినీతి అన్నది సహించేది లేదని.. తన పార్టీ నేతలు అవినీతికి పాల్పడిన వారిపై […]

ఏపీలో నలుగురు మంత్రులకు ఉద్వాసన? జగన్ సంచలన నిర్ణయం..నిజమా?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 4:12 PM

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి దాదాపు నెలన్నర అవుతోంది. ఇంకా కేబినెట్ పూర్తిగా కుదురుకోలేదు.. అప్పుడే కొంతమంది మంత్రులను తప్పించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అవినీతి రహిత పాలనే తమ లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి.. అవినీతి వ్యవహారాల్లో తలదూరుస్తున్నారనే వారిని కేబినెట్ నుంచి తప్పించడానికి రంగం సిద్ధం చేశారని సమాచారం.

సీఎం జగన్ మొదటి నుంచి తమ హయాంలో అవినీతి అన్నది సహించేది లేదని.. తన పార్టీ నేతలు అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే కొంతమంది మంత్రులు మాత్రం ఎన్నికల సమయంలో ఖర్చైన డబ్బును రాబట్టే క్రమంలో కాంట్రాక్టుల వైపు మళ్లారని జగన్‌కు పక్కాగా సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీనితో వారిపై చర్యలు తీసుకోవడానికి సీఎం ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ జాబితాలో ఒక మహిళా మంత్రి కూడా ఉందని సమాచారం. ఆమెకు మంత్రి పదవి దక్కడంపై అప్పట్లో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై వాస్తవం ఏంటి.. లేక వట్టి పుకార్లా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వదంతులు ‘కాక’ రేపుతున్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు