ఐపీఎల్ నుంచి మీరంతా వెళ్ళిపోతే ఎలా..!

ఐపీఎల్ 12వ సీజన్ ను క్రికెట్ అభిమానులందురూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ల విధ్వంసకరమైన బ్యాటింగ్, సిక్సర్ల మోత, వికెట్లు పడగొట్టడాన్ని టీవీల్లో చూస్తూ కేరింతలు కొడుతున్న అభిమానులకు కాస్త చేదు వార్తే ఇది. వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆయా జట్లకు సంబంధించిన కీలక ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు. దీంతో ముఖ్యంగా హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు జట్లు ఎక్కువగా నష్టపోనున్నాయి. జట్ల వారీగా స్వదేశానికి పయనమవుతున్న విదేశీ ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. […]

ఐపీఎల్ నుంచి మీరంతా వెళ్ళిపోతే ఎలా..!
Follow us

|

Updated on: Apr 25, 2019 | 4:46 PM

ఐపీఎల్ 12వ సీజన్ ను క్రికెట్ అభిమానులందురూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ల విధ్వంసకరమైన బ్యాటింగ్, సిక్సర్ల మోత, వికెట్లు పడగొట్టడాన్ని టీవీల్లో చూస్తూ కేరింతలు కొడుతున్న అభిమానులకు కాస్త చేదు వార్తే ఇది. వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో ఆయా జట్లకు సంబంధించిన కీలక ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు.

దీంతో ముఖ్యంగా హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు జట్లు ఎక్కువగా నష్టపోనున్నాయి. జట్ల వారీగా స్వదేశానికి పయనమవుతున్న విదేశీ ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

సన్ రైజర్స్ హైదరాబాద్ – వార్నర్, బెయిర్ స్టో, షకిబుల్ హాసన్

చెన్నై సూపర్ కింగ్స్ – డుప్లెసిస్, తాహిర్

ముంబై ఇండియన్స్ – డికాక్, బెహ్రెండర్ఫ్

కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్ – జో డెన్లీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – మొయిన్ అలీ, స్టోయినిస్, క్లసీన్, డెల్ స్టెయిన్

రాజస్థాన్ రాయల్స్ – స్టీవెన్ స్మిత్, బెన్ స్టోక్స్, ఆర్చర్

ఢిల్లీ క్యాపిటల్స్ – రబడా