జోరు వానలు.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరదలు!

Flood Water Increased At Kaleshwaram Project Due To Rain, జోరు వానలు.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరదలు!

భూపాలపల్లి:  రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజి వద్దకు వరద పోటెత్తింది. నీటి సామర్ధ్యం క్రమేపి పెరుగుతుండటంతో అన్నారం బ్యారేజి గేట్లను ఎత్తి వేశారు. అటు నీటిని విడుదల చేయడానికి బ్యారేజి 5 బ్లాక్‌లోని 2 గేట్లను అధికారులు తెరిచారు. దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *