బ్రేకింగ్ న్యూస్: ఏఓబీలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు ఏసీఎం కిషోర్ మృతి.. కొనసాగుతున్న కాల్పులు

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఎదురుకాల్పులతో మోతెక్కింది. భద్రతా బలగాలకు, మావోయిస్టు నక్సల్స్‌కు మధ్య గురువారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి.

  • Rajesh Sharma
  • Publish Date - 3:47 pm, Thu, 26 November 20
బ్రేకింగ్ న్యూస్: ఏఓబీలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు ఏసీఎం కిషోర్ మృతి.. కొనసాగుతున్న కాల్పులు

Fire exchange in AOB area: అంధ్రా, ఒడిశా బోర్డర్‌‌లో కాల్పుల మోత మోగుతోంది. మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ఏసీఎం కిషోర్ మరణించినట్లు సమాచారం. మల్కాన్ గిరి జిల్లాలోని కటాఫ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టు నక్సల్స్‌ ఎదురు పడడంతో కాల్పులు మొదలైనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

గత కొంత కాలంగా ఇటు తెలంగాణ-మహారాష్ట్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దుతోపాటు అటు ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌లో మావోయిస్టుల సంచారం పెరిగినట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం వుంది. దానికి తోడు పలువురు రాజకీయ నాయకులను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని హతమారుస్తున్నారు. దాంతో భద్రతా బలగాలు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో కూంబింగ్ ఆపరేషన్స్ పెంచారు. అందులో భాగంగా ఏఓబీలో కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టులు తారస పడడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.