అప్పుడే నేను, నయన్‌ పెళ్లి చేసుకుంటాం: విఘ్నేష్

ప్రేమ సక్సెస్ అయితే చాలు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.

అప్పుడే నేను, నయన్‌ పెళ్లి చేసుకుంటాం: విఘ్నేష్

Updated on: Aug 25, 2020 | 5:59 PM

Vignesh Shivn- Nayanthara marriage: ప్రేమ సక్సెస్ అయితే చాలు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే విఘ్నేష్ శివన్, నయన్ మాత్రం పెళ్లి విషయంలో చాలా నిదానంగా ఉన్నారు. ఇదిగో ఇప్పుడు.. అదుగో అప్పుడు విఘ్నేష్‌, నయన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడమే గానీ.. ఈ ఇద్దరు మాత్రం వివాహంపై ఇంతవరకు ఏ మాట చెప్పలేదు. కాగా తాజాగా నయన్‌తో పెళ్లిపై విఘ్నేష్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

”మా పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. వృత్తిపరంగా మేము సాధించాల్సిన ఆశయాలు కొన్ని ఉన్నాయి. వాటికంటే ముందు మేము పెళ్లి గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం మేమిద్దరం సంతోషంగా ఉన్నాము. అయినా డేటింగ్‌ లైఫ్‌పై బోర్‌ కొట్టినప్పుడే మేము పెళ్లి గురించి ఆలోచిస్తాం” అని అన్నారు. ఇక తనకు, నయన్‌కి మీడియాలో 22 సార్లు పెళ్లి అయ్యిందని విఘ్నేష్‌ నవ్వుతూ వెల్లడించారు. మరోవైపు తనకు, నయనతారకు పాజిటివ్ వచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయని, అది తమను బాధించిందని ఈ దర్శకుడు వెల్లడించారు.

అయితే ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌, కాటు వాకుల రెండు కాదల్‌ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా.. నయనతార, సమంత హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read More:

ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్‌పై దర్శకుడు క్లారిటీ

టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట.. ఏకంగా

Loading...
Unable to load recommendations.
Follow Us