టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట.. ఏకంగా

టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో పోలీస్ శాఖకు పది అవార్డులు వచ్చాయి

టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట.. ఏకంగా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 25, 2020 | 3:43 PM

AP Police Department: టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో పోలీస్ శాఖకు పది అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది పలు విభాగాల్లో పోలీస్ శాఖకు ఇప్పటికే 26 అవార్డులు రాగా.. తాజాగా మరో పది అవార్డులను సొంతం చేసుకుంది. టెక్నికల్ విభాగంలో 7 అవార్డులు, అనంతపురం జిల్లాకు 2, సీఐడీ 4S 4U విభాగానికి 1 అవార్డు లభించింది. ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను దక్కించుకొన్న ఏకైక ప్రభుత్వ విభాగం పోలీస్ శాఖనే కావడం విశేషం.

ఇక ఈ అవార్డులను వెబినార్ ద్వారా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తోన్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలను సాధిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ డీజీ హరీష్ కుమార్ గుప్త, ఐ.జి పర్సనల్ మహేష్ చంద్ర లడ్డా, ఐ. జి. పి అండ్ ఎల్ నాగేంద్ర కుమార్, టెక్నికల్ డి.ఐ.జీ పాలరాజు, డి.ఐ.జీ రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Read More:

అలా చేశారో కఠిన చర్యలు తప్పవు.. ఆసుపత్రులకు జగన్‌ హెచ్చరిక

సినిమా పాటలకు వచ్చే ఆదరణ మంచి వీడియోలకు రావు: ఏపీ సీఐడీ ఏడీజీ