పవన్‌ గైర్హాజరు.. అసలు మ్యాటర్ ఏంటంటే

మెగా ప్రిన్సెస్‌, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బిజినెస్‌మేన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఎంగేట్‌మెంట్ జరిగింది.

పవన్‌ గైర్హాజరు.. అసలు మ్యాటర్ ఏంటంటే

Updated on: Aug 14, 2020 | 12:47 PM

Niharika Konidela Engagement: మెగా ప్రిన్సెస్‌, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. బిజినెస్‌మేన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఎంగేట్‌మెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌, ఉపాసన ఇలా దాదాపుగా మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది. అయితే ఈ వేడుకలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మిస్ అయ్యారు. తన కుటుంబంలోని వేడుక అయినప్పటికీ, పవన్ గైర్హాజరు అవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రస్తుతం పవన్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆ కారణంగానే ఆయన హాజరు కాకపోయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతుండగా.. మరి ఈ దీక్షలో ఉన్నప్పుడే నితిన్‌ పెళ్లి వేడుకకు వెళ్లారు కదా అని మరికొందరు అంటున్నారు. తన అభిమాని శుభకార్యానికి వెళ్లిన పవర్‌స్టార్‌, సొంత అన్న కుమార్తె నిశ్చితార్ధానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు మెదులుతున్నాయి. కనీసం తన కుటుంబాన్ని అయినా పంపొచ్చు కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ, పవన్ మధ్య దూరం మళ్లీ పెరిగిందా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే  విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సాయంత్రం పూజలు ఉండటంతో ఉదయమే పవన్‌, నాగబాబు ఇంటికి వెళ్లి నిహారికను దీవించారట. ఈ సందర్భంగా నిహారికకు కాబోయే భర్తతో కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1920 కొత్త కేసులు.. 9 మరణాలు

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’‌పై తెలంగాణ దృష్టి

Loading...
Unable to load recommendations.
Follow Us