బాలయ్య ఇంతవరకు యాడ్‌లలో ఎందుకు నటించలేదో తెలుసా..!

కాస్త ఫేమ్ వచ్చిన తరువాత యాడ్‌లలో నటించేందుకు చాలా మంది ప్రముఖులు ఆసక్తిని చూపుతుంటారు. అయితే కొందరు మాత్రం వాటికి దూరంగా ఉంటుంటారు.

బాలయ్య ఇంతవరకు యాడ్‌లలో ఎందుకు నటించలేదో తెలుసా..!

Updated on: Jun 11, 2020 | 8:35 AM

కాస్త ఫేమ్ వచ్చిన తరువాత యాడ్‌లలో నటించేందుకు చాలా మంది ప్రముఖులు ఆసక్తిని చూపుతుంటారు. అయితే కొందరు మాత్రం వాటికి దూరంగా ఉంటుంటారు. అలా ఇప్పటివరకు ఒక్క యాడ్‌లో కూడా నటించలేదు నందమూరి బాలకృష్ణ. పలు యాడ్‌ సంస్థలు ఆయనకు భారీ రేటును ఆఫర్ చేసినప్పటికీ.. ఆయన వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు చాలా వార్తలు వినిపిస్తుంటాయి. అయితే ఇంతవరకు యాడ్‌లలో నటించకపోవడానికి గల కారణాన్ని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

యాడ్‌లలో నటించకూడదన్నది తన తండ్రి నిర్ణయమని ఆయన అన్నారు. ఏదైనా బ్రాండ్‌ని ప్రమోట్ చేయడం వలన అభిమానులు వాటిని కొనుగోలు చేస్తుంటారని, కానీ అది చాలా తప్పని ఎన్టీఆర్ తమకు తరచుగా చెప్తూ ఉండేవారని బాలయ్య చెప్పుకొచ్చారు. ఆ మాటలు తన మదిలో ఉండిపోయానని, అందుకే ఇంతవరకు ఎలాంటి బ్రాండ్‌లను ప్రమోట్ చేయలేదని ఆయన తెలిపారు. కాగా బుధవారం బాలయ్య తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

Read This Story Also: లెస్బియన్‌గా మారిన గోపిచంద్ నటి..!

Loading...
Unable to load recommendations.
Follow Us