లిక్కర్ షాపుకు తీసుకెళ్లమని సోనుకు రిక్వెస్ట్.. నటుడి రియాక్షన్ ఏంటంటే..!

| Edited By:

May 25, 2020 | 2:43 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా సొంతింటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, స్టూడెంట్స్‌కి నటుడు సోనూసూద్‌ ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది కార్మికులను వారి స్వగ్రామాలకు పంపడంతో పాటు ఆహారాన్ని అందిస్తున్నారు ఆయన. ఆపదలో ఉన్నామంటూ సోషల్‌మీడియాలో తనకు రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. దీనిపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘యు ఆర్ ట్రూ హీరో’ అంటూ పలువురు సోనూసూద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల […]

లిక్కర్ షాపుకు తీసుకెళ్లమని సోనుకు రిక్వెస్ట్.. నటుడి రియాక్షన్ ఏంటంటే..!
Follow us on

కరోనా లాక్‌డౌన్ కారణంగా సొంతింటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, స్టూడెంట్స్‌కి నటుడు సోనూసూద్‌ ఆసరాగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది కార్మికులను వారి స్వగ్రామాలకు పంపడంతో పాటు ఆహారాన్ని అందిస్తున్నారు ఆయన. ఆపదలో ఉన్నామంటూ సోషల్‌మీడియాలో తనకు రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన సాయం చేస్తూనే ఉన్నారు. దీనిపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘యు ఆర్ ట్రూ హీరో’ అంటూ పలువురు సోనూసూద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా ఇటీవల ఓ నెటిజన్ సోనూసూద్‌కు సరదా ట్వీట్‌ను పెట్టారు. ‘సోనూ భాయ్‌. నేను ఇంట్లో చిక్కుకున్నా. దయచేసి నన్ను లిక్కర్ షాప్‌ వరకు తీసుకెళ్లరూ..?’ అంటూ సోను ట్యాగ్ చేస్తూ బల్లా భాయ్‌ అనే నెటిజన్ ట్వీట్ పెట్టారు. దానికి సోనూ స్పందిస్తూ.. ‘భాయ్‌ మీరు లిక్కర్‌ షాప్‌కి వెళ్లేందుకు నేను సహాయం చేస్తా. కానీ ఇప్పుడది అవసరమా..?’ అంటూ ఓ లాఫింగ్ ఎమోజీని పెట్టారు. కాగా కరోనా వచ్చినప్పటి నుంచి తనకు చేతనైన సాయాన్ని సోనూ చేస్తూనే వస్తున్నారు. జుహులో తన హోటల్‌ని హెల్త్‌ వర్కర్ల కోసం కేటాయించిన ఆయన డాక్టర్లు పీపీఈ కిట్లను కూడా అందజేసిన విషయం తెలిసిందే. రీల్ లైఫ్‌లో చాలా విలన్‌ పాత్రల్లో నటించిన ఈ నటుడు రియల్ లైఫ్‌లో మాత్రం ‘ట్రూ హీరో’గా పేరును తెచ్చుకుంటున్నారు.

Read This Story Also: బన్నీ ‘పుష్ప’లో యాంకర్ సుమ.. ఏ పాత్రంటే..!