క్రేజీ న్యూస్‌.. విజయ్‌- అనుష్క కాంబోలో మూవీ..!

అనుష్క తన ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పారు. గత కొన్ని రోజులుగా అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పెట్టారు.

క్రేజీ న్యూస్‌.. విజయ్‌- అనుష్క కాంబోలో మూవీ..!

Edited By:

Updated on: Oct 05, 2020 | 3:16 PM

Anushka Vijay Deverakonda: అనుష్క తన ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పారు. గత కొన్ని రోజులుగా అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పెట్టారు. ఫ్యాన్స్‌తో ఇంటరాక్షన్‌లో తాను మరో రెండు సినిమాలకు ఒప్పుకున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు మరిన్ని కథలు కూడా వింటున్నానని అనుష్క స్పష్టం చేశారు. ఈ క్రమంలో అనుష్క తదుపరి మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న సినిమాలో అనుష్క నటించనుందట. అంతేకాదు ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇద్దరు సంతకం చేశారని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోలో సినిమా రానుంది. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనన్య హీరోయిన్‌గా నటిస్తుండగా.. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.

Read More:

Kajal Marriage: బిజినెస్‌మెన్‌ని పెళ్లాడబోతున్న కాజల్‌..!

అన్‌లాక్‌ 5: ఏపీలో ప్రభుత్వం పలు నిబంధనలు, సూచనలు.. మార్గదర్శకాలివే