Tollywood : ఏంటీ.. భద్రాచలం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఆ టాలీవుడ్ టాప్ నటుడి కూతురా..? ఇప్పుడేం చేస్తుందంటే..

2001లో శ్రీహరి హీరోగా, ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'భద్రాచలం' చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు తెలుసా. ? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, అందంతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే..

Tollywood : ఏంటీ.. భద్రాచలం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఆ టాలీవుడ్ టాప్ నటుడి కూతురా..? ఇప్పుడేం చేస్తుందంటే..
Bhadrachalam Movie

Updated on: Oct 21, 2026 | 8:00 PM

టాలీవుడ్ మాస్ హీరో శ్రీహరి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం ‘భద్రాచలం’. ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా, శ్రీహరిని పూర్తి స్థాయి మాస్ హీరోగా మరియు అగ్రశ్రేణి నటుడిగా నిలబెట్టింది. అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ సెంటిమెంట్, పగలు-ప్రతీకారాలు , సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రంలో అన్నదమ్ములు, చెల్లెలి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు ఎన్. శంకర్ పూర్తిగా సఫలమయ్యారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆ అమ్మాయి పేరు చేతన. ఆమె మరెవరో కాదు.. నటుడు ఉత్తేజ్ కుమార్తే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

నటి చేతన ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన బాల్యం, సినీ ప్రస్థానం, ముఖ్యంగా భద్రాచలం సినిమా జ్ఞాపకాలు, తోటి నటులతో తన అనుభవాలను పంచుకున్నారు. చిన్నతనంలో చేతన్ ఒక మంచి కూచిపూడి నర్తకి. డాన్స్ ఆధారిత పాత్రల్లో నటించాలని ఆమె ఆశించినప్పటికీ, అప్పట్లో బాల నటీమణులు తక్కువగా ఉండటంతో అబ్బాయి పాత్రలు ఎక్కువగా చేశానని తెలిపారు. సునయన, తనిష్, బాలదిత్య, కీర్తన (అంజి సినిమా), శ్రావ్య (ఆర్య సినిమా) వంటి వారంతా ఒకే బ్యాచ్‌గా పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు. ప్రభాస్‌తో కలిసి పౌర్ణమి సినిమాలో నటించినప్పుడు చేతన వయస్సు 13-14 సంవత్సరాలు. ఆ రోజుల్లో ప్రభాస్ సెట్‌లో అత్యంత అల్లరి చేసే వ్యక్తి అని, అందరినీ ఆటపట్టించేవారని చేతన నవ్వుతూ చెప్పారు.  తన తండ్రి ఉత్తేజ్, ప్రభాస్ మధ్య కూడా చక్రం వంటి సినిమాల ద్వారా మంచి బాండింగ్ ఉందని చేతన్ పేర్కొన్నారు. తనతో కలిసినప్పుడు “నాన్నగారు ఎలా ఉన్నారు?” అని ప్రభాస్ పలకరిస్తారని చెప్పారు.

భద్రాచలం సినిమాలో శ్రీహరితో కలిసి పనిచేసిన అనుభవం చేతనకు చాలా ప్రత్యేకమైనది. శ్రీహరిని తాను కేవలం నటుడిగానే కాకుండా, తన కుటుంబ సభ్యులలో ఒకరిగా, ఒక మామగా లేదా పెదనాన్నగా భావించేదాన్నని చేతన తెలిపారు. శ్రీహరి సెట్‌లో ప్రొడక్షన్ సిబ్బందితో సహా అందరితో సరదాగా ఉండేవారని, ఆటలు ఆడిస్తూ వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన చాలా దయగల వ్యక్తి అని, అనేక మందికి ఆర్థికంగా సహాయం చేశారని విన్నానని చేతన్ చెప్పారు. గంభీరంగా కనిపించేవారు చాలా సున్నితమైన మనస్సు కలవారని, శ్రీహరి కూడా అలాంటివారేనని అన్నారు. భద్రాచలం సినిమాలో నటి గీత నటన గురించి ప్రస్తావిస్తూ, గ్లిజరిన్ లేకుండా ఆమె సహజంగా ఏడ్చిన సన్నివేశం తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని చేతన్ చెప్పారు. అటువంటి అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ను ప్రత్యక్షంగా చూడగలిగినందుకు ఆ రోజు చాలా ఆనందించానని తెలిపారు. శ్రీహరితో తనకున్న “ఊరి నుంచి నీకేం తీసుకురమ్మంటావ్ అమ్మ” అని అడిగినప్పుడు “మంచి పేరు తీసుకురా” అని చెప్పే డైలాగ్ ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి చెందిందని చేతన్ గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

చేతన..

Chetana

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Loading...
Unable to load recommendations.
Follow Us