Unstoppable With NBK: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఇక కాస్కోండి.. పవన్‌, బాలయ్య అన్‌స్టాపబుల్‌ ప్రోమో వచ్చేసింది.

తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్‌ ఏ రేంజ్లో క్లిక్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నట విశ్వరూపం, డైలాగ్స్‌తో మెస్మరైజ్‌ చేసే బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి, హీరోలను ఇంటర్వ్యూ చేయడం అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది...

Unstoppable With NBK: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఇక కాస్కోండి.. పవన్‌, బాలయ్య అన్‌స్టాపబుల్‌ ప్రోమో వచ్చేసింది.
Pspk X Nbk First Glimpse

Updated on: Jan 15, 2023 | 11:56 AM

తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న అన్‌స్టాపబుల్‌ ఏ రేంజ్లో క్లిక్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నట విశ్వరూపం, డైలాగ్స్‌తో మెస్మరైజ్‌ చేసే బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి, హీరోలను ఇంటర్వ్యూ చేయడం అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఇక ప్రస్తుతం అన్‌స్టాపబుల్‌ సెకండ్ సీజన్‌ ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. రెండో సీజన్‌ కూడా ముగింపునకు వచ్చేసింది. దీంతో సీజన్‌కు గ్రాండ్‌గా వీడ్కోలు పలికేందుకు ఆహా సిద్ధమైంది. ఇందులో భాగంగానే చివరి ఎపిసోడ్‌ను పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ప్లాన్‌ చేశారు.

అన్‌స్టాపబుల్‌కు పవన్‌ హాజరవుతున్నాడన్న వార్త తెలియగానే పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎప్పుడెప్పుడు షో స్ట్రీమింగ్ అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆహాలో రెబల్ స్టార్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక త్వరలోనే పవర్ స్టార్‌ ఎపిసోడ్‌ను టెలికాస్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆహా.. ఫ్యాన్స్‌కు సంక్రాంతి కానుకను ఇచ్చింది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ X ఎన్‌బీకే ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో వీడియోను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

కేవలం 1.12 నిమిషాల నిడివి ఉన్న గ్లింప్స్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా షోకి పవర్‌ స్టార్‌ ఎంట్రీ మొదలు, ఆయన ధరించిన డ్రస్‌ హైలెట్‌గా నిలిచాయి. ఇక గ్లింప్స్‌లో బాలయ్య పవన్‌ ఉద్దేశిస్తూ.. ‘ఈయన మెజర్‌మెంట్స్‌ తీసుకోవాలి’ అనడం, దానికి పవన్‌ నవ్వడం ఫ్యాన్స్‌ను థ్రిల్‌ చేసింది. వీడియోను ఇలా రిలీజ్‌ చేశారో లేదో అలా ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ గ్లింప్స్‌ ఎపిసోడ్‌పై మరింత అంచనాలు పెంచేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి గ్లింప్స్‌కే ఇలా ఉంటే ఫుల్‌ ఎపిసోడ్‌ ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..