Upasana: ఈ సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన ఉపాసన.
మెగా కోడలు ఉపాసన కొణిదెల తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తమ ఇంటికి వారసుడు రాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. రామ్‌చరణ్ తండ్రి కాబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్‌లో జోష్‌ని పెంచింది. పెళ్లైన పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పడంతో..
మెగా కోడలు ఉపాసన కొణిదెల తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తమ ఇంటికి వారసుడు రాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. రామ్‌చరణ్ తండ్రి కాబోతున్నాడన్న వార్త ఫ్యాన్స్‌లో జోష్‌ని పెంచింది. పెళ్లైన పదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పడంతో మెగా ఫ్యామిలీలోనూ సంతోషం వెల్లి విరిసింది. ఇక అప్పటి నుంచి అటు ఉపాసన కానీ, ఇటు రామ్ చరణ్ కానీ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో జరిగి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో చెర్రీతో కలిసి ఉపాసన పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉపాసన ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తనకు ఈ ఏడాది చాలా ముఖ్యమైందని చెప్పుకొచ్చారు. ‘ఈ ఏడాది సంక్రాంతి అంటే.. మాతృత్వాన్ని ఆస్వాదించడమే. ఈ దశనే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా ప్రయాణంలో ఇదొ కొత్త ఆరంభం’ అంటూ ఉపాసన రాసుకొచ్చింది. ఉపాసన ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా వైరల్ అవుతోంది. క్షణాల్లో లక్షల సంఖ్యలో లైక్స్ కురిశాయి.
View this post on Instagram
దీనిబట్టి చూస్తే ఉపాసన తన మాతృత్వాన్ని ఎంతలా ఎంజాయ్ చేస్తుందో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే చెర్రీ తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని చిరు తెలిపిన క్షణాల్లో సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. ఉపాసన సరోగసి ద్వారా గర్భం దాల్చిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఉపాసన స్వయంగా పోస్ట్ చేయడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..