Harsha sai: చిక్కుల్లో యూట్యూబర్‌ హర్ష సాయి.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు

|

Sep 24, 2024 | 7:49 PM

యూట్యూబర్‌ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు హర్షసాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ చేస్తుంది ఆ యువతి. నార్సింగి పీఎస్‌లో హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వొకేట్‌ సహా నార్సింగి పీఎస్‌కు వచ్చింది యువతి. 

Harsha sai: చిక్కుల్లో యూట్యూబర్‌ హర్ష సాయి.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు
Harsha Sai
Follow us on

సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబర్‌ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు
హర్షసాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ చేస్తుంది ఆ యువతి. నార్సింగి పీఎస్‌లో హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వొకేట్‌ సహా నార్సింగి పీఎస్‌కు వచ్చింది యువతి.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్న హర్ష సాయి.. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు. ఆ కామెంట్‌కు తోడు.. మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ యువ సామ్రాట్ హర్ష సాయి పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయి పై కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో రూ. 2 కోట్ల వరకు వసూల్ చేశాడని ఆమె ఆరోపించింది. ఇప్పటికే ఆమె పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు హర్ష సాయి. ఇలానే ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. హర్ష సాయి హీరోగా మధ్య ఓ సినిమా కూడా మొదలైంది. అతనే సొంతంగా ఓ కథ రాసుకుని.. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం మెగా. అప్పట్లో టీజర్ ను కూడా విడుదల చేశారు. ఆ సినిమాకు నిర్మాత ఎవరో కాదు. బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న మిత్ర శర్మ నిర్మాతగా మారి హర్ష సాయితో సినిమా అనౌన్స్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.