కేజీఎఫ్ చాప్టర్ 2 (KGF Chapter 2) ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. మొదటి పార్ట్ తో సంచలన విజయాన్ని అందుకున్న యష్.. ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. కేజీఎఫ్ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డ్స్ ను కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తుంది. మొదటి రోజే సెకండ్ షో కూడా పడక ముందే రూ.100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది కేజీఎఫ్ 2. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు ( ఆరు రోజులు) ఏకంగా రూ . 600 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే కేజీఎఫ్ చాప్టర్ 2 త్వరలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.
కేజీఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా చాప్టర్ 2 ఐదు భాషల్లో విడుదలైంది. హిందీలో మంగళవారం (ఏప్రిల్ 19) ఒక్క రోజే రూ.20 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు కేజీఎఫ్ బాలీవుడ్ లో 238 కోట్లు వసూల్ చేసింది. చాప్టర్ 2 ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో రూ.5.09 కోట్ల భారీ షేర్ వసూలు చేసింది. చాప్టర్ 2 USAలో ఐదు రోజుల వ్యవధిలో 5 మిలియన్ మార్క్ (సుమారు రూ. 39 కోట్లు) చేరిన మొదటి కన్నడ చిత్రంగా నిలిచింది. చాప్టర్ 2 ను హోంబలే ఫిలిమ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.
#OneWordReview…#KGF2: BLOCKBUSTER.
Rating: ⭐️⭐⭐️⭐️½#KGFChapter2 is a WINNER, more than lives up to the humongous hype… #PrashanthNeel immerses us into the world of #KGF2, delivers a KING-SIZED ENTERTAINER… MUST, MUST, MUST WATCH. #KGF2Review pic.twitter.com/Bsg2NKEmrh— taran adarsh (@taran_adarsh) April 14, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :