Vijay- Rashmika: అతిథులకు సర్‌ప్రైజ్.. విజయ్‌-రష్మిక పెళ్లి కార్డు బాక్స్ లో ఏమేం ఉన్నాయో తెలుసా? వీడియో

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ముహూర్తం దగ్గరికొచ్చేసింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా ఫిబ్రవరి 26న ఈ ప్రేమ పక్షులు ఏకం కానున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Vijay- Rashmika: అతిథులకు సర్‌ప్రైజ్.. విజయ్‌-రష్మిక పెళ్లి కార్డు బాక్స్ లో ఏమేం ఉన్నాయో తెలుసా? వీడియో
Vijay Deverakonda, Rashmika

Updated on: Feb 19, 2026 | 6:26 PM

టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లికి కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటికే విజయ్ ఇంటికి లైటింగ్ డెకరేషన్ కూడా పెట్టారు. అలాగే పెళ్లి కార్డుల పంపిణీ కూడా జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో విజయ్-రష్మికల పెళ్లి జరగనుంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు. ఆ తర్వాత మార్చ్ 4న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కాగా విజయ్- రష్మికల వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారింది. వీరు తమ పెళ్లికి వచ్చే అతిథులకు పెళ్లి కార్డుని ఓ స్పెషల్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఈ బాక్స్ లో పెళ్లి కార్డుతో పాటు అతిథులకు కొన్ని సర్ ప్రైజ్ అండ్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఈ మేరకు వెడ్డింగ్ ఇన్విటేషన్ అందుకున్న కొందరు పెళ్లి కార్డు బాక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

రష్మిక మందన్నా కొన్ని నెలల క్రితం ఒక పెర్ఫ్యూమ్ కంపెనీని ప్రారంభించింది. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన నేషనల్ క్రష్ అనే పెర్ఫ్యూమ్ బాటిల్ చిన్నది ఒకటి ఈ పెళ్లి కార్డు బాక్స్ లో పెట్టారు. అలాగే చేతులకు, కాళ్లకు రాసుకునే ఒక ఆయుర్వేదిక్ క్రీమ్ ఒకటి ఇచ్చారు. ఇక హీరో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కి చెందిన టీ షర్ట్ ఒకటి బాక్స్ లో పెట్టారు. అలాగే జీడిపప్పు ప్యాకెట్, ఒక స్వీట్ బాక్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

విజయ్ – రష్మిక పెళ్లి కార్డు బాక్స్ లో ఏమేం ఉన్నాయంటే? వీడియో

మొత్తానికి విజయ్ – రష్మిక వెడ్డింగ్ కార్డు బాక్స్ లో సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చూస్తుంటే ఈ వెడ్డింగ్ బాక్స్ కు బాగానే ఖర్చు అయి ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us