ఓటీటీలో రకరకాల సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అదే సమయంలో ఓటీటీలోనూ రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీలో హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు.. రొమాంటిక్ థ్రిల్లర్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కాగా ఓటీటీల్లో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు కొదవే లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఇంతకు ఈ సినిమాలో అంతగా ఏముందనుకుంటున్నారా.. ఊహించని ట్విస్ట్ లు.. రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో ఎక్కువే ఉన్నాయి.
తెలుగు సినిమాలే కాదు.. ఇతర భాషల్లోని సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతున్న సినిమాలోని కథ విషయానికొస్తే.. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం పై నిత్యం వార్తల్లో రకరకాల కథలను చూస్తుంటాం.. వివాహేతర సంబంధాలు వల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయ్యాయి.
ఇక ఈ సినిమాలో కథ ఏంటంటే.. ఈ సినిమాలో షైనీ , రేజి అనే భార్య భర్తలు ఉంటారు. వీరికి ఓ కొడుకు కూడా ఉంటాడు. అయితే భర్త రేజి సిటీలో ఉద్యోగం చేస్తూ నెలనెలా డబ్బులు పంపుతూ ఉంటాడు. భార్య షైనీ కొడుకుతో అత్త మామలతో కలిసి ఊర్లో జీవిస్తుంటారు. అయితే అత్తా మంచాన పడటంతో మామతో కలిసి ఆమెకు సేవలు చేస్తూ ఉంటుంది షైనీ. అయితే భర్త దూరంగా ఉండటంతో ఆమె మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటుంది. తన క్లాస్ మెట్ అయిన కిరణ్ అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంటుంది రేజి. అయితే ఈ ఇద్దరు కలుసుకోవడానికి అత్త మామ అడ్డుగా ఉన్నారని.. వారిని చంపాలని అనుకుంటారు. ఇందుకోసం షైనీ , కిరణ్ తో కలిసి ముందుగా అత్తను చంపడానికి ప్లాన్ చేస్తుంది. ఇంతలో వీరి ప్లాన్ ను మామ వింటాడు. ఈ ఇద్దరినీ ఓ రూమ్ లో బంధిస్తాడు మామ. ఆ తర్వాత ఏం జరిగింది.? షైనీ , కిరణ్ బయట పడ్డారా.? అత్తామామాలను చంపేశారా.? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఈ సినిమా పేరు ఉడాల్. ఈ సినిమా సైనా ప్లే అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాను అసలు మిస్ అవ్వకండి. ఒంటరిగా ఈ సినిమా చూడటం బెటర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.