Ori Devuda Twitter Review: వినోదానికి ఫాంటసీ మిక్స్ చేసిన ‘ఓరిదేవుడా’.. ట్విట్టర్ రివ్యూ

ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ సీన్.. ఫలక్ నామ దాస్, హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి హిట్స్ ను తన ఖాతలో వేసుకున్నాడు.

Ori Devuda Twitter Review: వినోదానికి ఫాంటసీ మిక్స్ చేసిన ఓరిదేవుడా.. ట్విట్టర్ రివ్యూ
Ori Devuda

Updated on: Oct 21, 2022 | 8:30 AM

టాలీవుడ్ లో తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. యూత్ కు కనెక్ట్ అయ్యే కథాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. ఈ నగరానికి ఏమైంది సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్ సీన్.. ఫలక్ నామ దాస్, హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి హిట్స్ ను తన ఖాతలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. అలాగే విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్.. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ తెరకెక్కించారు. సినిమాను దీపావ‌ళి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది.

తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడి పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేశారు. అర్జున్ దుర్గరాజు (విశ్వక్ సేన్), అను పాల్‌రాజ్ (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. కానీ, పెళ్లి తర్వాత కొన్నాళ్లకే మనస్పర్ధలతో వీరిద్దరూ విడిపోవాలని కోర్టును ఆశ్రయిస్తారు. అయితే విడిపోవాలనుకున్న వీరికి దేవుడు ఎలాంటి సాయం చేశాడు. ఎందుకు వీరు విడిపోవాలనుకున్నారు.? అసలు వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది.? అనేది థియేటర్స్ లో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ట్విట్టర్ లో ఈ సినిమా రివ్యూలు ఇస్తున్నారు నెటిజన్లు. మరి ఈ సినిమా ఎలా ఉందని అంటున్నారో ఇప్పుడు చూద్దాం..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us