Jana Nayagan Movie: ఎట్టకేలకు థియేటర్లలోకి విజయ్ లాస్ట్ మూవీ.. జన నాయగన్ రిలీజ్ డేట్ ఇదే..

దళపతి విజయ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా జన నాయగన్. రాజకీయలకు ముందు ఆయన నటించిన ఆఖరి సినిమా ఇదే. కానీ ఈ మూవీ విడుదలకు సెన్సార్ అడ్డంకులు పడిన సంగతి తెలిసిందే.

Jana Nayagan Movie: ఎట్టకేలకు థియేటర్లలోకి విజయ్ లాస్ట్ మూవీ.. జన నాయగన్ రిలీజ్ డేట్ ఇదే..
Jana Nayagan

Updated on: Jul 15, 2026 | 7:36 PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా తనదైన పాలనలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు సీఎం విజయ్. అయితే మొన్నటి వరకు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. ఇకపై తాను సినిమాల్లో నటించడం లేదని.. నటన నుంచి రిటర్మైంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. తన ఆఖరి సినిమా జన నాయగన్ అని స్వయంగా ప్రకటించారు. ఈ మూవీ కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయలకు ముందు ఆయన నటించిన ఈ మూవీ నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ ఇష్యూ కారణంగా పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడో సంక్రాంతికి విడుదలకావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. కానీ అంతకు ముందే తమిళనాడులో పలు టీవీల్లో ఈసినిమాను స్ట్రీమింగ్ చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

ఇప్పటికే ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 23 నుంచి థియేటర్లలో సందడి చేయనుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విజయ్ పోలీస్ డ్రెస్ లో పోస్టర్ షేర్ చేశారు. దీంతో విజయ్ దళపతి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈచిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత వెంకట్ కె. నారాయణ నిర్మించారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. ప్రేమలు ఫేమ్ మమితా బైజు కీలతపాత్ర పోషించింది. ఇదివరకు విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఎట్టకేలకు ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుండడంతో దళపతి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

జన నాయగన్ రిలీజ్ డేట్..

https://twitter.com/KvnProductions/status/2077324861123555408

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Follow Us