Jana Nayagan: ‘జననాయగన్‌’ లీక్‌ వెనక ఆ ఇద్దరి కుట్ర.. విజయ్ అభిమానుల సంచలన ఆరోపణలు

'జన నాయగన్' సినిమా మొత్తం హెచ్‌డి ఫార్మాట్‌లో లీక్ అయింది. ఇదిఆ సినిమా బృందానికి పెద్ద షాక్ ఇచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమే కాకుండా, అనేక ఇతర రాష్ట్రాల చిత్ర పరిశ్రమ నాయకులు కూడా దీనిని ఖండించారు. అయితే జననాయగన్ సినిమా లీక్‌ వెనక ప్రధానంగా ఇద్దరి కుట్ర ఉందని విజయ్ అభిమానులు, విజయ్ టీవీకే రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Jana Nayagan: ‘జననాయగన్‌’ లీక్‌ వెనక ఆ ఇద్దరి కుట్ర.. విజయ్ అభిమానుల సంచలన ఆరోపణలు
Jana Nayagan Movie

Updated on: Apr 12, 2026 | 4:56 PM

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన దళపతి విజయ్ ‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ సమస్యలతో ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే విజయ్ సినిమా రిలీజ్ చేయకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని స్వయంగా విజయ్ తన ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ శ్రేణులు కూడా జన నాయగన్ పై కుట్ర జరిగందని ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. విజయ్ రాజకీయ ప్రత్యర్థులు కుయుక్తితో తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సినిమా విడుదలను ఆపారని అంటున్నారు. ఈ గందరగోళం మధ్య, ‘జన నాయగన్’ సినిమా మొత్తం అకస్మాత్తుగా HD ఫార్మాట్‌లో లీక్ అయింది. ఇది చిత్ర బృందానికి పెద్ద షాక్ ఇచ్చింది. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ దీనిని ఖండించారు. అయితే జన నాయగన్ సినిమా లీక్‌కు ఇద్దరు రాజకీయ నాయకులే కారణమని విజయ్ అభిమానులు, విజయ్ TVK రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, తమిళనాడు బీజేపీ నాయకుడు ఎల్. మురుగన్, అలాగే తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన యువ నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌లే ‘జనయగన్’ సినిమా లీక్ వెనుక ఉన్నారని విజయ్ అభిమానులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ‘మొదట ‘జన నాయగన్’ సినిమా ప్రజలకు చేరకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు విజయ్ సినిమాను ఆర్థికంగా దెబ్బతీశారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, ఉదయనిధి స్టాలిన్‌లు కలిసి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్రకు పాల్పడ్డారు’ అని టీవీకే పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు అధవ అర్జున ఆరోపించారు. విజయ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఆరోపణలే చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

విజయ్ అభిమానుల ఆరోపణలు, టీవీకే నాయకుల ఆరోపణల తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై స్పందించారు. ‘జన నాయగన్’ సినిమా లీక్ అవ్వడం అన్యాయం, చట్టవిరుద్ధం. కానీ ఆ చర్యను మంత్రి ఎల్. మురుగన్‌కు ముడిపెట్టే ప్రయత్నం మాత్రం రాజకీయ ప్రేరేపితం. ‘దీనిలోకి బీజేపీని ఎందుకు లాగాలి? సినిమా విడుదల లేదా లీక్‌లో బీజేపీ పార్టీకి ఎలాంటి పాత్ర లేదు. ఈ లీక్‌పై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్య తీసుకోవడం పోలీసుల బాధ్యత. సరైన దర్యాప్తు ద్వారా ఈ చర్య వెనుక ఉన్న వ్యక్తులను వెలుగులోకి తీసుకురావాలి. కేవలం బీజేపీని దీనిలోకి లాగి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించవద్దు’ అని టీవీకే శ్రేణులకు కౌంటర్ ఇచ్చారు అన్నామలై.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us