Vijay Deverakonda: రష్మిక‏ నా డార్లింగ్.. చాలా ఇష్టం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన విజయ్..

రష్మిక నేను కలిసి 2 సినిమాలు చేశాము. మేమిద్దరం స్నేహితులం. తను నిజంగా నా డార్లింగ్. తనంటే చాలా ఇష్టం. జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి మేమేప్పుడు

Vijay Deverakonda: రష్మిక‏ నా డార్లింగ్.. చాలా ఇష్టం.. ఆసక్తికర కామెంట్స్ చేసిన విజయ్..
Vijay Rashmika

Updated on: Jul 29, 2022 | 2:36 PM

మోస్ట్ అవైయిటెట్ ఫిల్మ్ లైగర్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగాంగా ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేశారు విజయ్ (Vijay Deverakonda), హీరోయిన్ అనన్య. ఈ క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్నాతో తనకున్న రిలేషన్ షిప్ గురించి చెప్పుకొచ్చాడు. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై అటు రష్మిక, ఇటు విజయ్ ఇద్దరూ స్పందించలేదు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో.. రష్మిక తన డార్లింగ్ అని తనంటే చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

విజయ్ మాట్లాడుతూ.. “రష్మిక నేను కలిసి 2 సినిమాలు చేశాము. మేమిద్దరం స్నేహితులం. తను నిజంగా నా డార్లింగ్. తనంటే చాలా ఇష్టం. జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి మేమేప్పుడు మాట్లాడుకుంటాం. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది ” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తనకు తన తల్లిదండ్రులు, డైరెక్టర్ పూరితో మంచి అనుబంధం ఉందని చెప్పారు. తాను పెళ్లి చేసుకుని పిల్లలను కనే రోజు వస్తే ఆ విషయం అందరికీ గట్టిగా చెబుతానని… తనను ప్రేమించే ప్రేక్షకుల మనసు నొప్పించాలనుకోవడం లేదని.. ఆరాధించేవారి హృదయాలను విచ్చిన్నం చేయాలనుకోవడం లేదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య కథానాయికగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఆగస్ట్ 25న తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us