Vijay Devarakonda: ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి  చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ అందుకున్నడు. విజయ్ దేవరకొండ రేంజ్ ను అర్జున్ రెడ్డి సినిమా అమాంతం పెంచేసింది. విజయ్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఏర్పడింది. చివరిగా విజయ్ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Vijay Devarakonda: ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్ దేవరకొండ
Vijay Devarakonda

Updated on: Mar 29, 2024 | 5:08 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన.. విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.పెళ్లి  చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో భారీ హిట్ అందుకున్నడు. విజయ్ దేవరకొండ రేంజ్ ను అర్జున్ రెడ్డి సినిమా అమాంతం పెంచేసింది. విజయ్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఏర్పడింది. చివరిగా విజయ్ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .

ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. పెళ్లి చేసుకొని తండ్రి కావాలని ఉంది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోను. లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. నా ఫ్యామిలీకి కూడా ఆ అమ్మాయి తప్పక నచ్చాలి అని తెలిపాడు విజయ్.

కొంతమంది తమిళ దర్శకులు నాకు స్టోరీలు  చెప్పారు. అందులో కొన్ని త్వరలోనే పట్టాలెక్కిస్తా.. గౌతమ్‌ తిన్ననూరితో నేను చేయబోయే సినిమాలో చాలామంది కోలీవుడ్‌ నటీనటులు కూడా నటిస్తారు అని విజయ్‌ అన్నారు. ‘ఫ్యామిలీస్టార్‌ సినిమా యూనివర్సల్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీ స్టార్ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతుంది. ఆతర్వాత హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేస్తాం.. తమిళనాడులో 250 థియేటర్స్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ చేస్తాం అని అన్నారు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us