Tollywood: ఇండస్ట్రీలో రజినీకాంత్‌ను ‘ఒరేయ్’ అని పిలిచే ఒకే ఒక్కడిని నేనే.. సిగరెట్ తాగుతూ..

సీనియర్ నటుడు జి.వి. నారాయణరావు తన సినీ ప్రస్థానాన్ని, చిరంజీవితో తన స్నేహాన్ని పంచుకున్నారు. యముడికి మొగుడు, పసివాడి ప్రాణం వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాణ విశేషాలను కూడా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tollywood: ఇండస్ట్రీలో రజినీకాంత్‌ను ఒరేయ్ అని పిలిచే ఒకే ఒక్కడిని నేనే.. సిగరెట్ తాగుతూ..
Gv Narayana

Updated on: Mar 10, 2026 | 8:00 AM

ప్రొడ్యూసర్ జి.వి. నారాయణరావు, సూపర్‌స్టార్ రజినీకాంత్ మధ్య దశాబ్దాల కాలం నాటి స్నేహం గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “రజినీకాంత్‌ను రేయ్ అని పిలిచే ఒకే ఒక్క వ్యక్తిని నేనంటూ..” మరోసారి గుర్తు చేసుకున్నారు నారాయణరావు. తామిద్దరం కలిసి ఒకే సిగరెట్ పంచుకునేంత సన్నిహితంగా ఉండేవాళ్లమని, నారాయణ రావు నివాసానికి రజినీకాంత్ తరచుగా వచ్చి, ఆయన సోదరిని అక్కయ్య అని ఆప్యాయంగా పిలుస్తూ, భోజనాలకు కూడా హాజరయ్యేవారట.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

అంతులేని కథ చిత్రంలో రజినీకాంత్‌తో కలిసి నటించిన జి.వి. నారాయణ రావు, ఆ తర్వాత వరుసగా మరో రెండు చిత్రాలలోనూ కలిసి నటించారు. ఈరంకి శర్మ దర్శకత్వంలో రూపొందిన చిలకమ్మ చెప్పింది చిత్రం అందులో ఒకటి. బాలచందర్ కో-డైరెక్టర్‌గా పనిచేయగా.. ఈరంకి శర్మకు ఇది మొదటి చిత్రం. ఈ చిత్రంలో రజినీకాంత్, సంగీత, జి.వి. నారాయణ రావు, శ్రీప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. పాలకొల్లులో సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ సినిమా షూటింగ్ ఆ రోజుల్లో ప్రత్యేకంగా నిలిచింది. అప్పటి సినీ యూనిట్ల పనితీరును వివరిస్తూ, కేవలం కాల్ షీట్లు, షూటింగ్‌లకే పరిమితం కాకుండా, కెమెరాలను మోయడం, స్క్రిప్ట్‌లు చదవడం, తోటి నటీనటులకు డైలాగులు వినిపించడం వంటి పనుల్లో కూడా అందరూ కలిసి పాలుపంచుకునేవారని నారాయణ రావు తెలిపారు.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

పాలకొల్లులో షూటింగ్ జరుగుతున్న సమయంలో, ఒక యువకుడు వారిని కలిశాడట. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఆ యువకుడు, నటుడిగా మారాలనే తన కోరికను జి.వి. నారాయణ రావు, రజినీకాంత్‌లతో పంచుకున్నారు. అప్పుడు వారిద్దరూ తాము చదువుకున్న యాక్టింగ్ స్కూల్‌లో చేరమని ఆ యువకుడికి సలహా ఇచ్చారు. అప్పటికే రజినీకాంత్ కంటే నారాయణరావు వయసులో పెద్దవారు కాగా, ఆ యువకుడు రజినీకాంత్‌ను అన్నయ్య అని పిలిచేవారని, నారాయణ రావును సార్ లేదా అన్నయ్య అని సంబోధించేవారట. వారి సలహా మేరకు ఆ యువకుడు మద్రాస్ వచ్చి యాక్టింగ్ స్కూల్‌లో చేరారు. ఆ తర్వాత ఆ యువకుడు ఎంత ఎదిగారో, ఎంతటి మెగాస్టార్ అయ్యారో అందరికీ తెలుసని నారాయణ రావు వెల్లడించారు. ఆ యువకుడు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి, రజినీకాంత్, నారాయణరావులకు దేవదాస్ కనకాల గురువు కావడం విశేషం.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

Follow Us