Virata Parvam : ప్రముఖ ఓటీటీ చేతికి రానా విరాటపర్వం అంటూ టాక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

దగ్గుబాటి యంగ్ హీరో రానా త్వరలో విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో...

Virata Parvam : ప్రముఖ ఓటీటీ చేతికి రానా విరాటపర్వం అంటూ టాక్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Updated on: Jul 21, 2021 | 2:14 PM

Virata Parvam : దగ్గుబాటి యంగ్ హీరో రానా త్వరలో విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే హీరోయిన్ ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ , పోస్టర్లు సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశాయి. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఈ సినిమా ఉండనుంది. సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి విరాటపర్వంను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ స్ట్రీమింగ్ చేయనుందని టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది.

విరాటపర్వంను ‘నెట్ ఫ్లిక్స్’లో విడుదల చేయనున్నారనీ.. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించారు. విరాటపర్వం ఓటీటీలో విడుదలవుతుందన్న వార్తల్లో వాస్తవం లేదు అన్నారు. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుందని.. సినిమాను థియేటర్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని చెప్పుకొచ్చాడు. థియేటర్లు ఓపెన్ అయిన తరువాత పరిస్థితులు చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం జరుగుతుందని అన్నాడు వేణు ఊడుగుల.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Salaar: భారీ ప్లాన్ వేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ మూవీలో ఇదే హైలైట్ కానుందట..

Raj Kundra Arrest: రాజ్ కుంద్రాను వెనకేసుకొచ్చిన బాలీవుడ్ నటి.. పోర్న్, ఎరోటికా వీడియోలు ఒకటి కాదంటూ..

Anushka Shetty: టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న అనుష్క.. స్వీటీ సినీ జర్నీకి 16ఏళ్ళు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us