వీరప్పన్ ఈ పేరు చెప్తే ఒకానొక సమయంలో దేశం మొత్తం ఉలిక్కిపడేది. గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరుగాంచిన వీరప్పన్ ను పట్టుకోవడానికి అన్ని రాష్ట్రాల పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు. అయితే వీరప్పన్ కుమార్తె విద్యా రాణి బీజేపీలో చేరారు. ఇప్పుడు వీరప్పన్ రెండో కుమార్తె విజయలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. విజయ లక్ష్మీ ప్రధానపాత్రలో కోలీవుడ్ లో సినిమా తెరకెక్కుతుంది. ఇందుకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను కేఎన్ఆర్ రాజా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మావీరన్ పిళ్లై’ అనే పేరుతో సినిమా తెరకెక్కనుంది.
ఈ పోస్టర్ లో విజయలక్ష్మీ వీరప్పన్ స్టైల్ లో గన్ పట్టుకొని నిలుచున్నారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. రవివర్మ సంగీతం, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను గడగడలాడించిన వీరప్పన్‌ను ఎట్టకేలకు 2004లో తమిళనాడు టాస్క్‌ఫోర్స్ అధికారులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. గతంలోనూ వీరప్పన్ పైన పలు సినిమాలు వచ్చాయి. వీరప్పన్ః హంగర్ ఫర్ కిల్లింగ్ అనే సినిమా పై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. వీరప్పన్ భార్య వి.ముత్తులక్ష్మి ఆ సినిమా పై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీని ప్రభావం తన వ్యక్తిగత జీవితంపై పడుతుందని ఆమె ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. గతంలో చాలా మంది డబ్బుల కోసం వీరప్పన్‌పై సినిమాలను తీసి తమ పరువు, మర్యాదకు ఇబ్బంది కలిగించారని ఆమె అందులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కూతురు విజయలక్ష్మీ సినిమారంగంలోకి అడుగుపెట్టడం అదికూడా స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా చేయడం టాపిక్ అయ్యింది. ఆమె సినిమాల్లో ఈమేరకు రాణిస్తారో చూడాలి మరి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Pushpa Movie : ‘పుష్ప’నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ .. అడవిలో బన్నీ మెరుపు పరుగు