Hushar Pittalu : హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది.. యూత్‌కు పర్ఫెక్ట్ ట్రీట్..

ప్రస్తుతం చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హుషారు పిట్టలు సినిమా సైతం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఆగస్ట్ 15న ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Hushar Pittalu : హుషారు పిట్టలు ట్రైలర్ వచ్చేసింది.. యూత్‌కు పర్ఫెక్ట్ ట్రీట్..
Hushar Pittalu

Updated on: Aug 10, 2026 | 11:34 AM

యంగ్ హీరోహీరోయిన్లు అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ , పంపిణీ సంస్థలైన ఏషియన్, సురేష్ ఫిలింస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని గణనీయంగా పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

విడుదలైన ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా సాగుతూ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువతను మెప్పించే లవ్, కామెడీ, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు బిక్షు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రధాన జోడీ అన్షు , వాసవి గణేషన్ మధ్య కెమిస్ట్రీ, నటన, అలాగే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంభాషణలు చాలా సజీవంగా, యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఈ చిత్రానికి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగినట్లుగా ఉండి, సన్నివేశాల ప్రాధాన్యతను పెంచేలా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్నాయని స్పష్టమవుతోంది. ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే, ‘హుషారు పిట్టలు’ చిత్రం ఆగస్టు 15 రేసులో వినోదాత్మక విందును అందించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లను మరింత జోరుగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

హుషారు పిట్టలు ట్రైలర్..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Loading...
Unable to load recommendations.
Follow Us