Varun Sandesh: హ్యాపీ డేస్ సినిమాకు వరుణ్ సందేశ్ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడో తెలుసా..?

వరుణ్ సందేశ్ తన పెళ్లి, వితికతో బంధం గురించి మాట్లాడారు. పెళ్లికి వయసు కేవలం ఒక సంఖ్య అని, సరైన వ్యక్తి దొరకడమే ముఖ్యమని తెలిపారు. వితికతో స్నేహబంధం, ఆమె ఇచ్చిన సర్ప్రైజ్‌లు, అలాగే తను ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. హ్యాపీ డేస్ రెమ్యూనరేషన్, ఫ్యూచర్ ప్లానింగ్స్ పంచుకున్నారు.

Varun Sandesh: హ్యాపీ డేస్ సినిమాకు వరుణ్ సందేశ్ ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నాడో తెలుసా..?
Varun Sandesh

Updated on: Dec 13, 2025 | 8:15 PM

నటుడు వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత, సినీ జీవితంలోని పలు కీలక విషయాలను పంచుకున్నారు. 26 లేదా 27 ఏళ్ల వయస్సులో వితికకు పెళ్లి చేసుకున్నానని, మ్యారేజ్‌కు వయసు కేవలం ఒక సంఖ్య అని, సరైన వ్యక్తి దొరికితే ఎప్పుడైనా చేసుకోవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పరిశ్రమలో చాలామంది 30 ఏళ్లు దాటి, విజయం సాధించిన తర్వాత వివాహం చేసుకోవాలని చూస్తారని, అయితే తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే వయసుతో సంబంధం లేదని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. వితికతో తన పరిచయం 2014లో మొదలైందని, వారి బంధం స్నేహంగా ప్రారంభమైందని తెలిపారు. తనకు తెలియకుండానే వితిక తన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిందని, తన గురించి అన్ని విషయాలు తెలుసునని, తన గతం, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నింటినీ పంచుకోగలిగానని చెప్పారు. వితిక కూడా తన జీవితంలోని బాధలు, కుటుంబ విషయాలు పంచుకుందని, అలా తామిద్దరం చాలా సన్నిహిత స్నేహితులయ్యారని వివరించారు. డేటింగ్, థియేటర్లకు వెళ్లడం వంటివి లేకుండానే వితిక తన జీవితంలో భాగం కావాలని నిర్ణయించుకుందని, తనను అదే అడిగిందని తెలిపారు. అమెరికాలో ఉండగా న్యూ ఇయర్ సందర్భంగా వితిక ఇచ్చిన సర్‌ప్రైజ్ విజిట్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, తన జీవితంలో అలాంటి సర్ప్రైజ్ ఎవరూ ఇవ్వలేదని పేర్కొన్నారు. వితిక చాలా దయ ఉన్న మనసున్న వ్యక్తి అని, ఆమె నిత్యం తనను ఆశ్చర్యపరుస్తూ ఉంటుందని ప్రశంసించారు.

వివాహ జీవితంలో సాధారణ గొడవలు ఉంటాయని, అన్నీ చిన్నచిన్న విషయాలకే జరుగుతాయని వరుణ్ సందేశ్ వెల్లడించారు. వంట విషయంలో ఉప్పు ఎక్కువైందని లాంటి చిన్న విషయాలకు కూడా గొడవలు అవుతాయని, అయితే తానే ముందు క్షమాపణ చెబుతానని ఒప్పుకున్నారు. వండిన వారికి, ముఖ్యంగా వితికకు, ఒక డిష్ కోసం ఎంతో శ్రమ పడుతుందని, కాబట్టి వాటిని అభినందించడం ముఖ్యమని చెప్పారు. వితిక సూసైడ్ అటెంప్ట్ గురించి మీడియాలో వచ్చిన వార్తలను వరుణ్ సందేశ్ ఖండించారు. వితికకు నిద్రలేమి సమస్య ఉందని, నిద్రమాత్ర వేసుకున్న తర్వాత మర్చిపోయి మళ్లీ వేసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారని, అది ఆత్మహత్యాయత్నం కాదని వివరించారు. ఆ సమయంలో తాను యూఎస్‌లో ఉన్నానని, వితిక ఆసుపత్రిలో ఉన్నా ‘ఐయామ్ ఫైన్’ అని చెప్పిందని తెలిపారు.

భవిష్యత్తులో పిల్లల గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదని, ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా తెలియజేస్తానని అన్నారు. తనను వరుణ్ సందేశ్ 2.0 అని కాకుండా, కేవలం వరుణ్ సందేశ్ గానే చూడాలని కోరారు. హ్యాపీ డేస్ సినిమాకు ఫ్లైట్ టికెట్లు వేసి, ఆ తర్వాత లక్ష రూపాయలు రెమ్యూనరేషన్‌గా ఇచ్చినట్లు తెలిపారు. కొత్త బంగారు లోకం సినిమాకు రెమ్యూనరేషన్ తనకు కచ్చితంగా గుర్తులేదని అన్నారు.