Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్..

దశాబ్దాలపాటు నటుడిగా అలరించిన విజయ్ దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో సీఎంగా తన మార్క్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. మరోవైపు సినీరంగంలోని పలువురు నటీనటులు ఇప్పటికే విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సైతం దళపతి విజయ్ ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్..
Varalakshmi , Cm Vijay

Updated on: Jul 18, 2026 | 12:23 PM

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటిగా తనదైన ముద్ర వేశారు వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ను కలిశారు. ఈ బేటీ అనంతరం సీఎం విజయ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు వరలక్ష్మి శర్త కుమార్. అలాగే సర్కార్ సినిమాలో తాము కలిసి పనిచేసిన సమయాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయమే విజయ్ అభిరుచి అని తాను చాలా సంవత్సరాల క్రితమే గ్రహించానని.. ఆయన నాయకత్వం పై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె అన్నారు. డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ సినిమాలో విజయ్ తో కలిసి నటించారు వరలక్ష్మి శరత్ కుమార్. ఈ మూవీలో ఆమె ప్రతినాయకులలో ఒకరిగా కనిపించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకున్నారు వరలక్ష్మి.

ఎక్కువ మంది చదివినవి : Pawan Kalyan : కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి.. పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

” దళపతి.. ఈ పోస్ట్ గురించి ఏం చెప్పాలా అని చాలా సేపు ఆలోచించాను. కానీ అప్పటికే చాలా చెప్పేశారని గ్రహించాను. అందుకే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. జనాలు వంద రకాలుగా మాట్లాడొచ్చు… కానీ చివరికి, సి. జోసెఫ్ విజయ్ మన ముఖ్యమంత్రి, ఆయన మనతోనే ఉంటారు. విమర్శించడం సులభమే, కానీ మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి అపారమైన ధైర్యం, పట్టుదల, ఇంకా తమిళనాడు ప్రజల నుండి వెల్లివిరిసే ప్రేమ కావాలి!! ఈ అధికార పదవిని గౌరవిద్దాం. మాటల కన్నా చేతలే గొప్పవి. నిరంతరం తప్పులు వెతికే వారికి కాలమే నిజాన్ని వెల్లడిస్తుంది. అప్పటి వరకు, అతను నిజంగా ఏమి సాధిస్తాడో చూడటానికి మనం కొంచెం సహనం, గౌరవం , ప్రోత్సాహాన్ని అందిద్దాం. ఐ లవ్ యూ సార్.. ఎల్లప్పుడూ ‘విజయ్ వెరియన్’ (విజయ్ అభిమాని)గానే ఉంటాను. మమ్మల్ని కలవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 6 కోట్లతో తీస్తే రూ.16 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా..

సర్కార్ సినిమా రోజులు గుర్తుచేసుకుంటే అది ఇప్పుడు ప్రవచనాత్మకంగా అనిపిస్తుంది. సర్కార్ సినిమా సమయంలోనే మీది ప్రజాసేవ ప్రయాణం అని అర్థమైంది. మహిళా సంక్షేమానికి సంబంధించిన అంశాలు, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ఎలా ముందుకు వెళ్లాలనే తన ఆశల గురించి కూడా చర్చించుకున్నాము. ఎల్లప్పుడూ ఆప్యాయంగా, వినయంగా ఉంటారు… తమిళనాడు ప్రజల కోసం జరగబోయే అద్భుతమైన మార్పులను చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను…” అంటూ రాసుకొచ్చారు విజయ్.

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

వరలక్ష్మి శరత్ కుమార్ పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

 

Follow Us