Actress Ananya Nagalla: మల్లేశం చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఈ తెలుగమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటించి ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన అనుభవాలను అనన్య తెలిపింది. అనన్య మాట్లాడుతూ.. “మల్లేశం సినిమా రిలీజ్ అయ్యాక దర్శకుడు శ్రీరామ్ వేణుగారు ఆ సినిమా చూసి వకీల్ సాబ్ లో ఈ క్యారెక్టర్ కు నేను సరిపోతానని పిలించారు. మూడు రౌండ్స్ ఆడిషన్ చేశాక సెలెక్ట్ చేశారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని నాకు ముందు తెలియదు. తెలిశాక సర్ ప్రైజ్ అయ్యాను.
జీవితంలో ఊహించని ఆనందం ఎదురైతే మనం వెంటనే దాన్ని నిజం అనుకోము. ఇదోదే కల అనిపిస్తుంటుంది. వకీల్ సాబ్ చిత్రంలో నా సెలెక్షన్ జరిగిన తర్వాత కూడా అదే ఫీలింగ్ కలిగింది. చిత్ర పరిశ్రమలో ఎన్నో రిజెక్షన్స్ చూసి వచ్చాను కాబట్టి, కొన్ని రోజులు అయ్యాక గానీ నిజంగానే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటిస్తున్నాను అనే నమ్మకం కలగలేదు అని చెప్పుకొచ్చింది. అలాగే వకీల్ సాబ్ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. తన పనేదో తన చూసుకునే అమ్మాయిలా కనిపిస్తాను. నేను చేసిన క్యారెక్టర్ మన జీవితంలో తరుచుగా చూస్తుంటాం. ఇలాంటి ఒక అమ్మాయికి సమస్య వస్తే, అయ్యో తనకు ఇలా జరిగిందా అని బాధపడేలా ఉంటుంది. నా క్యారెక్టర్ మీద ప్రేక్షకులు సింపథీ చూపిస్తారు అంటుంది అనన్య. అలాగే పవన్ కళ్యాణ్ గారితో సెట్ లో గడిపిన సమయం మర్చిపోలేను. ఆయనతో ఫన్ గా టైమ్ గడిచింది, పవన్ గారు చెప్పే విషయాలు ఇన్ స్పైరింగ్ గా ఉండేవి. అలాగే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో డీప్ డిస్కషన్స్ ఉంటాయి. సరదాగా మనం మాట్లాడుకునే విషయాలు మాట్లేందుకు ఆయన ఆసక్తి చూపించరు. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఏపీ లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే ఆ విషయం గురించి పవన్ గారు నాతో మాట్లాడారు. దిశ ఇన్సిడెంట్ లాంటివి అమ్మాయిల మీద జరిగినప్పుడు వాటి మీద పోరాటం చేసేందుకు నేనేమీ చేయలేను, నాకేమీ శక్తి లేదు అనుకోవద్దు నీ ప్రార్థనను యూనివర్స్ కు పంపించు. అది కూడా ప్రభావం చూపిస్తుందని పవన్ గారు చెప్పేవారు. ఆయనతో జరిగిన ఇలాంటి రెండు మూడు డిస్కషన్స్ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది అనన్య.
మరిన్ని ఇక్కడ చదవండి :
Most Eligible Bachelor: ఆకట్టుకుంటున్న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సాంగ్