Vaishnav Tej: ఉప్పెనలా ఎగసిపడుతున్న ఆఫర్లు .. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగా హీరో. తాజాగా..

మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఉప్పెన సినిమాతో పరిచయం అయ్యాడు ఈ కుర్ర హీరో.

Vaishnav Tej: ఉప్పెనలా ఎగసిపడుతున్న ఆఫర్లు .. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగా హీరో. తాజాగా..
Vishnav

Updated on: Jul 07, 2021 | 3:51 PM

Panja Vaishnav Tej : మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఉప్పెన’ సినిమాతో పరిచయం అయ్యాడు ఈ కుర్ర హీరో. ఉప్పెన సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కొత్త హీరోహీరోయిన్లు..అందమైన ప్రేమ కథ.. చాలా ఫ్రెష్ గా అనిపించే స్రీన్ ప్లే అన్నీ సినీ లవర్స్ ను కట్టిపడేశాయి. దాంతో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాదు.. 100కోట్లకు పైగా వసూళ్లను కూడా సాధించింది. అయితే ఈ సినిమా కంటే ముందే వైష్ణవ్ క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసాడు. కొండపోలం అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. రకుల్ ఈ మూవీలో పల్లెటూరి యువతిగా కనిపించనుంది. అయితే ఈ సినిమా విడుదల పైన మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా పనుల్లో క్రిష్ బిజీ అవ్వడంతో కొండపోలం కథ పక్కన పెట్టాడని అంటున్నారు. అయితే ఇప్పుడు వైష్ణవ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో… ఆతర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ సినిమాకి, ‘సంతోషం’ .. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాల దర్శకుడు దశరథ్ కథను అందించడం విశేషం. అయితే ప్రస్తుతం అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ ఈ సినిమా పూర్తయిన తర్వాత వైష్ణవ్ సినిమాను పట్టాలెక్కిస్తాడని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhuj Movie: ఓటీటీలోకి అజయ్ దేవ్‏గణ్ సినిమా.. ‘భుజ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

MAA Elections: ‘మా’ ఎన్నికలు.. ఏకగ్రీవం కోసం సీనియర్ల ప్రయత్నాలు.. సరికొత్త చర్చకు తెరలేపిన ప్రకాష్ రాజ్ ట్వీట్..

Shagufta Ali: కష్టాల్లో బుల్లితెర నటి.. కారు, నగలు అమ్ముకొని సాయం కోసం ఎదురు చూపు..

Follow Us